Vitamin B12 Veg Foods : విట‌మిన్ బి12 దండిగా ల‌భిస్తుంది.. పూర్తిగా వెజిటేరియ‌న్ ఫుడ్‌.. ఇంత తీసుకుంటే చాలు..!

Vitamin B12 Veg Foods : మ‌న శ‌రీరం స‌క్ర‌మంగా విధులు నిర్వ‌ర్తించాలంటే రోజూ అనేక పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని పోష‌కాల‌ను త‌ర‌చూ తీసుకోవాల్సిన ప‌ని ఉండ‌దు. అప్పుడ‌ప్పుడు తీసుకున్నా చాలు.. వాటిని శ‌రీరం నిల్వ చేసుకుని ఉప‌యోగించుకుంటుంది. ఇక కొన్ని విట‌మిన్లు మాత్రం మ‌న‌కు రోజూ కావాలి. అలాంటి వాటిల్లో విట‌మిన్ బి12 ఒక‌టి. ఈ మ‌ధ్య చాలా మంది విట‌మిన్ బి12 లోపంతో బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా శాకాహారుల్లో ఈ లోపం ఎక్కువ‌గా వ‌స్తోంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి.

సాధార‌ణంగా అనేక ర‌కాల విట‌మిన్లు మ‌న‌కు వెజ్, నాన్ వెజ్ ఆహారాల్లో రెండింటిలోనూ ల‌భిస్తాయి. కానీ విట‌మిన్ బి12 మాత్రం అధికంగా నాన్ వెజ్ ఆహారాల్లోనే ఉంటుంది. ఈ క్ర‌మంలో శాకాహారులు ఎక్కువ‌గా ఈ లోపం బారిన ప‌డుతుంటారు. అందుక‌ని వారు విట‌మిన్ బి12 ఉండే వెజ్ ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే విట‌మిన్ బి12 కేవ‌లం నాన్‌వెజ్ ఆహారాల్లోనే ఉంటుంద‌ని అనుకుంటారు. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. ప‌లు వెజ్ ఆహారాల్లోనూ ఇది ఉంటుంది. అందువ‌ల్ల వాటిని తీసుకుంటే విట‌మిన్ బి12 లోపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇక విట‌మిన్ బి12 ఉండే వెజ్ ఆహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Vitamin B12 Veg Foods take these daily to overcome deficiency
Vitamin B12 Veg Foods

విట‌మిన్ బి12 ఎక్కువ‌గా పాలు, చీజ్‌, పెరుగు వంటి ఆహారాల్లో ల‌భిస్తుంది. క‌నుక వీటిని రోజూ తీసుకుంటే ఈ విట‌మిన్ లోపం రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే కోడిగుడ్డు ప‌చ్చ‌, తెల్ల రెండు సొన‌ల‌లోనూ విట‌మిన్ బి12 ఉంటుంది. కొంద‌రు నాన్ వెజ్ తిన‌ని వారు గుడ్డును మాత్రం తింటారు. క‌నుక అలాంటి వారికి ఇది బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. ఇక సోయా, బాదంప‌ప్పు, కొబ్బ‌రి పాలు, న్యూట్రిష‌న‌ల్ ఈస్ట్, పుట్ట గొడుగులు, మామిడి టెంక లోప‌లి విత్త‌నం.. వంటి ఆహారాల్లోనూ మ‌న‌కు విట‌మిన్ బి12 ల‌భిస్తుంది. అందువ‌ల్ల వీటిని తీసుకుంటే విట‌మిన్ బి12 లోపం రాకుండా చూసుకోవ‌చ్చు.

ఇక విట‌మిన్ బి12 మ‌న శ‌రీరంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది ఎర్ర ర‌క్త క‌ణాల నిర్మాణానికి అవ‌స‌రం. అలాగే డీఎన్ఏ సింథ‌సిస్‌కు కూడా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల నాడీ సంబంధ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా భుజాలు, మెడ ద‌గ్గ‌ర వ‌చ్చే నొప్పి త‌గ్గుతుంది. అలాగే కాళ్లు, చేతులు లాగ‌డం, తిమ్మిర్లు వంటివ‌న్నీ విట‌మిన్ బి12 లోపం కార‌ణంగా వ‌స్తాయి. క‌నుక ఈ విట‌మిన్‌ను తీసుకుంటే ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ఇక విట‌మిన్ బి12 మ‌న‌కు బీఫ్‌, మ‌ట‌న్‌, పోర్క్‌ల‌లో, వాటికి చెందిన లివ‌ర్‌లో అధికంగా ల‌భిస్తుంది. అలాగే చికెన్‌, ట‌ర్కీ మాంసంలోనూ కావ‌ల్సినంత విట‌మిన్ బి12 ఉంటుంది. దీంతోపాటు స‌ముద్ర‌పు చేప‌ల్లోనూ విట‌మిన్ బి12 అధికంగానే ల‌భిస్తుంది. అందువ‌ల్ల ఈ ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకుంటుంటే దాంతో విట‌మిన్ బి12 ల‌భిస్తుంది. త‌ద్వారా ఈ విట‌మిన్ లోపం రాకుండా చూసుకోవ‌చ్చు. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి.

Share
Editor

Recent Posts