Vitamin C : మన శరీరానికి విటమిన్ సి చాలా అవసరం. రోగ నిరోధక శక్తిని పెంచి శరీరాన్ని రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. గాయాలు తొందరగా మానడానికి విటమిన్ సి ఎంతో ఉపయోగపడుతుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. సాధారణ జలుబును తగ్గించడంలో విటమిన్ సి ఎంతగానో తోడ్పడుతంది. మన శరీరానికి రోజూ 40 మిల్లీ గ్రాముల విటమిన్ సి అవసరం. మనం తీసుకునే ఆహారాల ద్వారా మాత్రమే విటమిన్ సి మన శరీరానికి అందుతుంది. విటమిన్ సి అధికంగా కలిగి ఉన్న ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. నారింజ పండ్లు నిమ్మ జాతికి చెందినవి. విటమిన్ సి, ఫైబర్ అధికంగా కలిగి ఉన్న వాటిల్లో నారింజ పండ్లు ఒకటి. థయామిన్, పొటాషియం వంటి మినరల్స్ కూడా నారింజ పండ్లల్లో ఉంటాయి. నారింజ పండ్లను తినడం ద్వారా విటమిన్ సి మన శరీరానికి అందడమే కాకుండా అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
2. అధికంగా ఉన్న బరువును తగ్గించడంలో నిమ్మకాయలు ఎంతగానో సహాయపడతాయి. నిమ్మకాయల్లో ఉండే విటమిన్ సి.. గుండె, జీర్ణాశయ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. నిమ్మకాయల్లో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుది. ఇది శరీరంలో మూత్ర పరిమాణాన్ని పెంచి కిడ్నీలల్లో రాళ్ళు ఏర్పడకుండా చేయడమే కాకుండా శరీరంలో పీహెచ్ స్థాయిలని అదుపులో ఉంచుతుంది. దీంతోపాటు రోగాలు రాకుండా ఉంటాయి.
3. ఉసిరి కాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. శరీరంలో రక్తప్రసరణ సాఫీగా సాగేలా చేయడంలో విటమిన్ సి పాత్ర ఎంతో ఉంటుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక ఒత్తిడిని అధిగమించడంలో విటమిన్ సి సహాయపడుతుంది. కనుక ఉసిరి కాయలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతతోపాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీంతోపాటు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అయితే ఉసిరికాయలు లభ్యం కాకపోతే వీటి జ్యూస్‌ను అయినా సరే రోజూ పరగడుపునే తాగాలి. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
4. జామ కాయల్లో విటమిన్ సితోపాటు పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గిస్తాయి. ఆహారంలో భాగంగా జామ కాయలను తీసుకోవడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడంలోనూ జామకాయలు ఎంతగానో తోడ్పడతాయి.
5. బొప్పాయి పండ్లలో ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. శరీరాన్ని శుద్ది చేయడంలో బొప్పాయి పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి బొప్పాయి పండ్లు సహాయపడతాయి.
ఈ పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సినంత విటమిన్ సి అందుతుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.