Foods For Men: స్త్రీలు, పురుషులు.. ఇరువురి శరీరాలు భిన్నంగా ఉంటాయి కనుక ఇరువురికీ భిన్న రకాల ఆహారాలు అవసరం అవుతాయి. వారిలో హార్మోన్లు భిన్నంగా ఉంటాయి కనుక పలు రకాల ఆహారాలను వారు రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే పురుషులు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
* పురుషులు తృణ ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి వారిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్)ను తగ్గిస్తాయి. ప్రోస్టేట్ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచుతాయి. కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి పెరుగుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది.
* పాలకూరను తీసుకోవడం వల్ల అందులో ఉండే మెగ్నిషియం రక్తనాళాలను సాగేలా చేస్తుంది. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. పాలకూరలో ఉండే ఫోలేట్ హోమోసిస్టీన్ లెవల్స్ ను తగ్గిస్తుంది. దీంతో పురుషులు ఆరోగ్యంగా ఉంటారు.
* సీడ్స్, నట్స్ ను పురుషులే కాదు, అందరూ తీసుకోవాల్సిందే. వీటిల్లో ప్రోటీన్లు, ఫైబర్, అవసరమైన కొవ్వులు ఉంటాయి. ముఖ్యంగా వాల్ నట్స్, బాదంపప్పును తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. దీని వల్ల రక్తం గడ్డకట్టదు. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
* చేపల్లో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా చూస్తాయి. అందువల్ల చేపలను పురుషులు తరచూ తింటుండాలి.
* గుమ్మడికాయ విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాల్లో జింక్ అధికంగా ఉంటుంది. ఇది పురుషులకు అత్యంత అవసరమైన పోషకాల్లో ఒకటి. దీని వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. టెస్టోస్టిరాన్ ఉత్పత్తి అవుతుంది. వీర్యం ఉత్పత్తి పెరుగుతుంది. శుక్రకణాలు నాణ్యంగా ఉంటాయి. సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి.