Black Guava : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో జామ పండ్లు కూడా ఒకటి. జామ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. అందరూ ఈ జామపండ్లను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. జామ పండ్లు రుచిగా ఉండడంతో పాటు ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. వైద్య నిపుణులు కూడా జామపండ్లను ఆహారంగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. అయితే సాధారణంగా ఆకు పచ్చ రంగులో ఉండి లోపల తెలుపు మరియు లైట్ పింక్ రంగుల్లో గుజ్జును కలిగి ఉంటాయి. ఇవి అందరికి తెలిసినవే. అయితే ఇవే కాకుండా జామకాయల్లో మరో రకం కూడా ఉంటుంది. అవే నల్ల జామకాయలు. అవును జామకాయల్లో నల్ల జామకాయలు కూడా ఉంటాయి. ఇవి పైన నల్లగా లోపల ఎర్రటి రంగులో గుజ్జును కలిగి ఉంటాయి.
అలాగే ఈ చెట్టు ఆకులు, పువ్వులు, కాండం కూడా నలుపు రంగులోనే ఉంటుంది. ఈ నల్ల జామకాయల గురించి మనలో చాలా మందికి తెలిసి ఉండదు. ఇతర జామకాయల వలె ఈ నల్ల జామకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాధారణ జామకాయల కంటే వీటిలో పోషకాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ నల్ల జామకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, పీచు పదార్థాలతో పాటు విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. నల్ల జామకాయలను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉండవచ్చు.
అలాగే ఈ జామకాయలను తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. పోషకాహార లోపం తలెత్తకుండా ఉంటుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా చేయడంలో కూడా ఈ జామకాయలు మనకు సహాయపడతాయి. నల్ల జామకాయల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ పండ్లను తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. అదే విధంగా రక్తహీనత సమస్యతో బాధపడే వారు ఈ నల్ల జామకాయలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ జామకాయల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.
ఇది ఎర్ర రక్తకణాలు ఎక్కువగా తయారయ్యేలా చేసి రక్తహీనతను తగ్గించడంలోదోహదపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. కనుక షుగర్ ఉన్నవారు తరచూ ఈ పండ్లను తినాలి. ఇక వీటిని తింటే బరువు కూడా తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ విధంగా నల్ల జామకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఇతర జామకాయల వలె వీటిని కూడా మనం ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.