కివీ పండ్లు చూసేందుకు అంతగా ఆకర్షణీయంగా ఉండవు. కానీ వాటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కివీ పండ్లు తియ్యగా, పుల్లగా ఉంటాయి. అయినప్పటికీ వీటిని కొందరు ఇష్టంగా తింటారు. కివీ పండ్లలో విటమిన్ కె, సి, ఇ, ఫోలేట్, పొటాషియం తదితర పోషకాలు సమృద్ధిగా ఉంతాయి. అందువల్ల శరీరాన్ని ఈ పండ్లు అన్ని రకాల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. కనుక ఈ పండ్లను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీని వల్ల ఏమేం లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కివీ పండ్లలో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హైబీపీని కంట్రోల్ చేస్తాయి. దీంతోపాటు శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది.
2. అనారోగ్యాలు, ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం తప్పనిసరి. అయితే అందుకు కివీ పండ్లు ఎంతగానో దోహదపడతాయి. వీటిల్లో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే కళ్ల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. కంటి చూపు మెరుగు పడుతుంది.
3. కివీ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ సమస్య నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. అందువల్ల తరచూ కివీ పండ్లను తింటుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. శరీరంలో ఏవైనా గాయాలు, వాపులు ఉన్నా త్వరగా మానుతాయి.
4. మలబద్దకం సమస్యతో బాధపడేవారు రోజూ కివీ పండ్లను తినడం మంచిది. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకం, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది.
5. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు తరచూ కివీ పండ్లను తినాలి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
6. కివీ పండ్లను తరచూ తినడం వల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల సీజనల్ వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రావు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365