పట్టు పురుగులను పెంచేందుకు మల్బరీ ఆకులను ఎక్కువగా వాడుతారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ మొక్కలకు పండ్లు కూడా కాస్తాయి. వాటిని మల్బరీ పండ్లని పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కొందరు వాటిని బొంత పండ్లు అని వ్యవహరిస్తారు. అయితే వాటిని మనం తినవచ్చు. ఇతర బెర్రీ పండ్లలాగే అవి కూడా మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* మల్బరీ పండ్లను తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
* మల్బరీ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనకు శక్తినిస్తాయి. శరీరం ఉత్సాహంగా ఉంటుంది.
* డయాబెటిస్ ఉన్నవారు మల్బరీ పండ్లను తింటే మంచిది. షుగర్ నియంత్రణలో ఉంటుంది.
* మల్బరీ పండ్లను తినడం వల్ల చర్మ సంరక్షణకు కావల్సిన పోషకాలు లభిస్తాయి.
* మల్బరీ పండ్లలో విటమిన్ సి, కె, ఫైబర్, ఐరన్‌లు ఉంటాయి. దీని వల్ల ఆ పండ్లను తింటే మనకు పోషణ అందుతుంది.
* మల్బరీ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. తెల్లరక్త కణాల సంఖ్యను పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి.