Papaya : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో బొప్పాయి పండు కూడా ఒకటి. బొప్పాయి పండు మనకు దాదాపు అన్ని కాలాల్లో విరివిరిగా లభిస్తుంది. బొప్పాయి పండు మన ఆరోగ్యానికి, అందానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా వేసవికాలంలో దీనిని తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వేసవికాలంలో బొప్పాయి పండును తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. ఎండ వల్ల శరీరం కోల్పోయిన పోషకాలు తిరిగి అందుతాయి. అంతేకాకుండా బొప్పాయి పండును తీసుకోవడం వల్ల బరువు తగ్గడం నుండి గుండె ఆరోగ్యం మెరుగుపడడం వరకు ఇలా అనేక ఫలితాలను సొంతం చేసుకోవచ్చు.
అయితే ఈ బొప్పాయి పండును ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మరింత చక్కటి ఫలితాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. పరగడుపున బొప్పాయి పండును తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. అలాగే దీనిని ఖాళీ కడుపున తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం సమస్య మన దరి చేరకుండా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఎ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బొప్పాయి పండును తినడం వల్ల జుట్టు కాంతివంతంగా బలంగా తయారవుతుంది. అలాగే బొప్పాయి పండును తీసుకోవడం వల్ల వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి.
అలాగే బొప్పాయి పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటనాయిడ్లు శరీరంలో ఉండే ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో దోహదపడతాయి. అలాగే బొప్పాయి పండును తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధకతను పెంచడంలో దోహదపడుతుంది. అలాగే బొప్పాయి పండును తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ విధంగా బొప్పాయి పండు మనకు ఎంతగానో సహాయపడుతుందని దీనిని పరగడుపున తీసుకోవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.