వ‌ర్షాకాలంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు ఈ పండ్ల‌ను తినండి..!

వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు.. వాతావ‌ర‌ణంలో అనేక మార్పులు వ‌స్తాయి. ఉష్ణోగ్ర‌త‌లు ఒక్క‌సారిగా త‌గ్గుతాయి. దీంతోపాటు దోమ‌లు కూడా వృద్ధి చెందుతాయి. ఈ క్ర‌మంలో అనేక ర‌కాల వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే కింద తెలిపిన పండ్ల‌ను ఈ సీజ‌న్‌లో తీసుకోవ‌డం వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌వ‌చ్చు. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. మ‌రి ఈ సీజ‌న్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

take these fruits in monsoon season for better health

ఈ సీజ‌న్‌లో పియ‌ర్స్, యాపిల్స్, దానిమ్మ‌, అరటి, బొప్పాయి, కివీ వంటి పండ్ల‌ను తినాలి. వీటిని రోజూ తిన‌వ‌చ్చు. అయితే భోజ‌నం పూర్తిగా మానేసి పండ్ల‌ను తిన‌రాదు. భోజ‌నం చేశాక 2 గంట‌లు వ్య‌వ‌ధి ఇచ్చి పండ్ల‌ను తినాలి. ఈ పండ్ల‌ను ఈ సీజ‌న్ లో రోజూ తిన‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

ఈ పండ్ల‌ను భోజ‌నం అనంత‌రం 2 గంట‌ల స‌మ‌యం త‌రువాత తిన‌వ‌చ్చు. లేదా సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ మాదిరిగా తీసుకోవ‌చ్చు. అయితే అన్ని పండ్ల‌ను క‌లిపి చిన్న చిన్న ముక్క‌లుగా చేసి వాట‌న్నింటిని ఒక క‌ప్పు మోతాదులో తీసుకుంటే అన్ని పండ్ల‌ను తిన్న‌ట్లు ఉంటుంది. దీంతోపాటు అన్ని పండ్ల‌లో ఉండే పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. దీని వ‌ల్ల ఎక్కువ ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

ఈ పండ్ల‌లో విట‌మిన్ సి, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్లు, ఐర‌న్ వంటి పోష‌కాలు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల అనేక వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. అనారోగ్యాల బారిన ప‌డ్డవారు వీటిని తింటే త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

ఇక ఈ సీజ‌న్‌లో నేరేడు పండ్లు కూడా ఎక్కువ‌గానే ల‌భిస్తాయి. క‌నుక వాటిని కూడా తిన‌వ‌చ్చు. వాటిలోనూ విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగానే ఉంటాయి. అందువ‌ల్ల అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts