వ‌ర్షాకాలంలో డ్రై ఫ్రూట్స్‌, న‌ట్స్ ను నిల్వ చేసే విష‌యంలో ఈ సూచ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాలి..!

క‌రోనా ఏమోగానీ ప్ర‌స్తుతం ప్ర‌జ‌లంద‌రూ ఆరోగ్య‌క‌ర‌మైన అల‌వాట్ల‌ను పెంచుకుంటున్నారు. అందులో భాగంగానే ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తీసుకుంటున్నారు. ముఖ్యంగా న‌ట్స్‌, డ్రై ఫ్రూట్స్ వాడ‌కం పెరిగింది. కార‌ణం.. అవి పోష‌కాల‌ను బాగా క‌లిగి ఉండ‌డ‌మే. కోవిడ్ వ‌చ్చిన వారు వాటిని తింటే త్వ‌ర‌గా కోలుకుంటారు. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇత‌రులు కూడా కోవిడ్ వ‌చ్చినా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌వ‌ద్ద‌ని చెప్పి న‌ట్స్‌, డ్రై ఫ్రూట్స్ ను తింటున్నారు.

important tips for storing dry fruits and nuts in monsoon season

అయితే వ‌ర్షాకాలంలో న‌ట్స్‌, డ్రై ఫ్రూట్స్ ను నిల్వ చేయ‌డం కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఈ సీజ‌న్ సుమారుగా 3-4 నెల‌లు ఉంటుంది. క‌నుక ఆయా ప‌దార్థాలు త్వ‌ర‌గా చెడిపోయేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ కింద తెలిపిన సూచ‌న‌లు పాటిస్తే న‌ట్స్‌, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

* ఈ సీజ‌న్‌లో న‌ట్స్‌, డ్రై ఫ్రూట్స్ లో తేమ చేరుతుంది. క‌నుక వాటిని ఎయిర్ టైట్ సీసాల్లో నిల్వ చేయాలి. సీసాల‌ను బాగా తుడిచి పొడి అయ్యేలా చేసి వాటిల్లో న‌ట్స్‌, డ్రై ఫ్రూట్స్ ను ఉంచి నిల్వ చేయాలి. దీంతో అవి ఎక్కువ రోజుల పాటు ఉంటాయి. తేమ చేర‌కుండా ఉంటుంది. పాడ‌వ‌కుండా ఉంటాయి.

* న‌ట్స్‌, డ్రై ఫ్రూట్స్ కు సూర్య కాంతి త‌గిలితే త్వ‌ర‌గా పాడ‌వుతాయి. ఇక కొంద‌రు వాటిని కిచెన్‌లో ఉంచుతారు. కానీ కిచెన్‌లో వేడిగా ఉంటుంది క‌నుక ఆ స్థితిలో కూడా అవి పాడ‌వుతాయి. క‌నుక న‌ట్స్‌, డ్రై ఫ్రూట్స్ ను చ‌ల్ల‌గా, పొడిగా ఉండే ప్ర‌దేశంలో ఉంచాలి. దీంతో త్వ‌ర‌గా పాడుకాకుండా చూసుకోవ‌చ్చు.

* న‌ట్స్‌, డ్రై ఫ్రూట్స్ ను గాలి చొర‌బ‌డ‌ని (ఎయిర్ టైట్‌) సీసాల్లో నిల్వ చేశాక వాటిని అవ‌స‌రం అయితే ఫ్రిజ్ లో పెట్టుకోవ‌చ్చు. దీంతో అవి 12 నెల‌ల పాటు నిల్వ ఉంటాయి.

* ఇక న‌ట్స్‌, డ్రై ఫ్రూట్స్ ను ఘాటైన వాస‌న వ‌చ్చే వెల్లుల్లి, ఉల్లిపాయ‌ల వంటి ప‌దార్థాల‌కు దూరంగా ఉంచాలి. లేదంటే త్వ‌ర‌గా పాడ‌వుతాయి.

ఈ సూచ‌న‌ల‌ను పాటించ‌డం వ‌ల్ల న‌ట్స్‌, డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండేలా చేయ‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts