మనకు అందుబాటులో ఉన్న చిరు ధాన్యాల్లో అరికెలు ఒకటి. వీటినే ఇంగ్లిష్ లో కోడో మిల్లెట్స్ అంటారు. ఇవి లేత ఎరుపు లేదా గ్రే కలర్‌లో ఉంటాయి. వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అరికెలతో అన్నం, ఉప్మా వంటివి వండుకుని తినవచ్చు. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* అరికెలలో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి.
* డయాబెటిస్ ఉన్నవారికి అరికెలు మంచి ఆహారం. వీటిని తింటే షుగర్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు.
* వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కణాలు దెబ్బ తినకుండా సురక్షితంగా ఉంటాయి.
* అరికెలలో విటమిన్ బి6, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, మెగ్నిషియం, జింక్ అధికంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పోషణను అందిస్తాయి.
* మహిళలు అరికెలను తినడం వల్ల వారికి నెలసరి సమస్యలు తగ్గుతాయి. గుండె జబ్బులు ఉన్నవారు తింటే తీవ్రమైన దుష్పరిణామాలు ఏర్పడకుండా ముందుగానే నిరోధించవచ్చు.
* హైబీపీ, కొలెస్ట్రాల్ లెవల్స్‌ను అరికెలు తగ్గిస్తాయి. రక్తహీనతతో బాధపడేవారు వీటిని తింటే మంచిది.
* నిద్రలేమి సమస్య ఉన్నవారు రాత్రి పూట వీటిని తింటే చక్కగా నిద్ర పోవచ్చు.