Orange : నారింజ పండ్లను చాలామంది తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. నారింజ పండ్లు పుల్లగా ఉన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నారింజ పండ్లలో పోషకాలు బాగా ఎక్కువగా ఉంటాయి. మనం నారింజ జ్యూస్ వంటి వాటిని చేసుకోవచ్చు. నారింజ పండ్లను తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. మరి నారింజ పండ్లతో ఎలాంటి లాభాలను పొందవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నారింజ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడానికి కూడా నారింజ పండ్లు బాగా ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యాన్ని కూడా నారింజ పండ్లు మెరుగుపరుస్తాయి. నారింజ పండ్లలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. బీటా కేరోటిన్, పొటాషియం, మెగ్నీషియంతోపాటు ఫైబర్ కూడా వీటిలో ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి కూడా ఈ పండ్లలో ఎక్కువగా ఉంటుంది.
నారింజ పండ్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వాళ్లకు కూడా ఈ పండు బాగా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని కూడా ఈ పండు పెంచుతుంది. యాంటీ వైరల్ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతోపాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఇందులో ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులను నివారించేందుకు ఈ పండు సహాయం చేస్తుంది. ఈ పండును తీసుకున్నా లేదంటే జ్యూస్ కింద చేసుకుని తీసుకున్నా ఎన్నో లాభాలు ఉంటాయి.
కాబట్టి వీలైనప్పుడల్లా ఈ పండ్లను తీసుకుంటూ ఉండండి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. చర్మ వృద్ధాప్యాన్ని నివారించగలదు. ఇది చర్మాన్ని కూడా ఆరోగ్యంగా మారుస్తుంది. ఈ పండును తీసుకుంటే చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. రక్తపోటుని కూడా ఈ పండు కంట్రోల్ చేస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువ ఉంటుంది. రక్తపోటుని నియంత్రించడంలో సహాయం చేస్తుంది.
గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్స్ ఇందులో పుష్కలంగా వుంటాయి. రక్తం గడ్డ కట్టకుండా నివారించి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్ల ప్రమాదం నుండి కూడా ఇది బయట పడేస్తుంది. ఇలా అనేక లాభాలని నారింజపండు ద్వారా పొందొచ్చు. కానీ ఎక్కువగా నారింజ పండ్లని తీసుకోవడం వలన గుండెలో మంట కలిగే అవకాశం ఉంటుంది. పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉన్నవాళ్లు డాక్టర్‌ని కన్సల్ట్ చేసి నారింజ పండ్లను తీసుకోవడం మంచిది. ఎక్కువగా నారింజ పండ్లను తీసుకుంటే దంత క్షయం కలగవచ్చు. రోజుకి ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ తినకండి.