చాలామందికి ప్రతిరోజు ఉదయం లేవగానే ఏదో ఒకటి తినే అలవాటు, తాగే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలోనే మనకు ఏ ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటే వాటిని తింటూ ఉంటాం. అయితే ఈ విధంగా పరగడుపున ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మనకు సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. అందుకోసమే ఉదయం లేవగానే పరగడుపున ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
చాలామందికి ఉదయం లేవగానే కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. ముందు రోజు రాత్రి మనం భోజనం చేసి ఉంటాము కనుక మనలో అధిక జీర్ణరసాలు విడుదలై ఉంటాయి. ఈ క్రమంలోనే వేడివేడిగా టీ తాగినప్పుడు కడుపులో తీవ్రమైన మంట కలుగుతుంది. అందుకోసమే ఉదయం కాఫీ లేదా టీ తాగేటప్పుడు ముందుగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగడం ఎంతో ఉత్తమం. అదేవిధంగా సిట్రస్ జాతికి చెందిన పండ్లను తీసుకోవడం వల్ల గుండెలో అధిక మంట ఏర్పడుతుంది.
మరి కొందరికి ఉదయం లేవగానే పరగడుపున అరటి పండ్లను తినే అలవాటు ఉంటుంది. అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది అయితే భోజనం తర్వాత తినడం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకానీ పరగడుపున అరటి పండు తినటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పరగడుపున పెరుగు, కూల్ డ్రింక్స్, టమాటాలను తినకూడదు. అలాగే ఉదయం ఉదయం మసాలా కూరలు తినకూడదని నిపుణులు చెబుతుంటారు. ఆహార పదార్థాలను తినటం వల్ల కడుపులో మంట, గ్యాస్ ఏర్పడటం జరుగుతుంది కనుక పొరపాటున కూడా ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.