పోష‌కాహారం

బీట్‌రూట్ తింటే ఏం అవుతుందో తెలుసా…

బీట్‌రూట్ తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. అయితే, బీట్ రూట్ అనేక ఆరోగ్యప్రయోజనాలను కలిగినటువంటి హెల్తీ వెజిటేబుల్ ఇది. భూమిలో పండే బీట్‌రూట్ ఎన్నో రకాల పోషకాలను క‌లిగి ఉంటుంది. శక్తినిచ్చే శాకందుంపల్లో బీట్‌రూట్‌ది ప్రత్యేక స్థానం. బీట్ రూట్ లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఫాస్పరస్, ఫోలిక్ యాసిడ్ ఇలా మ‌న శ‌రీరానికి కావాల్సిన ఎన్నో ర‌కాల పోషాకాలు ఉన్నాయి. బీట్‌రూట్‌ను చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. బీట్‌రూట్‌ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది.

అంతేకాదు పెదవులు పొడారకుండానూ చూస్తుంది. బీట్‌రూట్‌ను తినడం ఇష్టం లేని వారు, కనీసం దాని జ్యూస్‌ను అయినా రోజూ ఉదయాన్నే పరగడుపున తాగితే చాలా మంచిది. గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది. ఇక‌ బీట్‌రూట్‌లో అద్భుతమైన ఆరోగ్య లాభాలు దాగి ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేయండి..

– బీట్‌రూట్‌లో నైట్రేట్లు రక్తంలో కలిశాక నైట్రిక్‌ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీంతో అధిక రక్తపోటుకు చెక్ పెట్టేందుకు స‌హాయం చేస్తుంది.

– బరువు తగ్గాలనుకునేవారు రోజు బీట్‌రూట్ జ్యూస్ తాగడం ఉత్త‌మం. ప్ర‌తిరోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్‌ తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుంది.

many wonderful health benefits of beetroot

– గర్భిణీలు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల వారి కడుపులో ఉండే బిడ్డకు ఫోలిక్‌ యాసిడ్ అంద‌డంతో బిడ్డ ఎదుగుదల స‌క్ర‌మంగా సాగుతుంది.

– బీట్‌రూట్ జ్యూస్ త‌గ్గ‌డం వ‌ల్ల‌ రెట్టింపు శక్తిని, సామర్థ్యాన్ని పొందవచ్చు. ఓ గ్లాసు బీట్‌రూట్ జ్యూస్ తాగడం వ‌ల్ల‌ 16 శాతం అధిక శక్తిని పొందుతారు.

-బీట్‌రూట్‌లోని పీచు పదార్థాలు ఉంటాయి. దీని వ‌ల్ల మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. పెద్దప్రేగును శుభ్రపరిచే శక్తి దీనికి ఉంది.

– ప్ర‌తి రోజూ బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల మెదడు భాగంలో రక్త ప్రసరణ స‌క్ర‌మంగా, చురుకుగా జ‌రిగి జ్ఞాప‌క‌శ‌క్తి పెంచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.

– బీట్ రూట్ జ్యూస్ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రిగి గుండె జ‌బ్బుల‌కు దూరం ఉంచేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

Admin