Flax Sesame Kalonji Seeds : వీటిని తీసుకుంటే కీళ్ల మ‌ధ్య శ‌బ్దం రాదు.. గుజ్జు పెరిగి కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి..

Flax Sesame Kalonji Seeds : వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రిని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మోకాళ్ల నొప్పుల స‌మ‌స్య కూడా ఒక‌టి. కీళ్ల మ‌ధ్య జిగురు త‌క్కువ‌గా ఉత్ప‌త్తి అవ్వ‌డం వ‌ల్ల మోకాళ్లల్లో కీళ్లు అరిగిపోయి నొప్పులు, వాపు, న‌డుస్తుంటే శ‌బ్దం రావ‌డం వంటివి జ‌రుగుతుంది. మోకాళ్ల నొప్పుల వ‌ల్ల క‌లిగే బాధ అంతా ఇంతా కాదు. న‌డిచేట‌ప్పుడు, కూర్చునేట‌ప్పుడు, మెట్లు ఎక్కేట‌ప్పుడు ఎంతో ఇబ్బంది క‌లుగుతుంది. ఈ స‌మ‌స్య త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌న ఆహార‌పు అల‌వాట్లే అని చెప్ప‌వ‌చ్చు. వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను త‌క్కువ‌గా తీసుకోవ‌డం, అధిక బ‌రువు, క్యాల్షియంలోపం వంటి వివిధ కార‌ణాల చేత ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది.

చాలా మంది మోకాళ్ల నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌డానికి మందుల‌ను, ఆయింట్ మెంట్ ల‌ను, క్యాల్షియం స‌ప్లిమెంట్ ల‌ను, పెయిన్ కిల్ల‌ర్ ల‌ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల నొప్పి త‌గ్గిన‌ప్ప‌టికి వీటి వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాలు అధికంగా ఉంటాయి. మందులు వాడే అవ‌స‌రం లేకుండా మ‌న ఇంట్లోనే ఒక పొడిని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా మోకాళ్ల నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. మోకాళ్ల నొప్పుల‌ను త‌గ్గించే ఈ పొడిని ఎలా త‌యారు చేసుకోవాలి..త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి… అలాగే ఈ పొడిని ఎలా వాడాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పొడిని తయారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం అవిసె గింజ‌ల‌ను, నువ్వుల‌ను, కాళోంజి విత్త‌నాల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఈ మూడు ప‌దార్థాల‌ను స‌మ‌పాళ్ల‌ల్లో తీసుకుని క‌ళాయిలో వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌గా పొడిగా చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న పొడిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవాలి.

Flax Sesame Kalonji Seeds for knee pain and joint pains
Flax Sesame Kalonji Seeds

ఈ పొడిని రోజూ ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ పాల‌ల్లో క‌లిపి తాగాలి. ఇలా 15 రోజుల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా తాగాలి. ఇలా తాగిన త‌ర‌వుఆత వారం రోజుల పాటు గ్యాప్ ఇచ్చి మ‌ర‌లా 15 రోజులు తాగాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల కీళ్ల మ‌ధ్య గుజ్జు పెరిగి శ‌బ్దం రాకుండా ఉంటుంది. అలాగే మోకాళ్ల నొప్పులు కూడా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. ఈ పొడిని త‌యారు చేసుకోవ‌డానికి వాడిన నువ్వులు, అవిసె గింజ‌లు, క‌లోంజి విత్త‌నాల్లో క్యాల్షియం, ఐర‌న్, విట‌మిన్ సి, విట‌మిన్ ఎ, విట‌మిన్ బి 12, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఇలా అనేక ర‌కాల పోష‌కాలు ఉన్నాయి. ఇవి నొప్పుల‌ను త‌గ్గించి ఎముక‌ల‌ను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి.

ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల మోకాళ్ల నొప్పులు త‌గ్గ‌డంతో పాటు అనేక ఇత‌ర ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఈ పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. ర‌క్ల‌పోటు అదుపులో ఉంటుంది. జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. మోకాళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు ఈ విధంగా ఇంట్లోనే ఈ పొడిని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts