Walnuts And Almonds : వాల్ న‌ట్స్‌, బాదంప‌ప్పు.. రెండింటినీ రోజూ తీసుకోవ‌చ్చా..?

Walnuts And Almonds : డ్రై ఫ్రూట్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌నం ర‌క‌ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆరోగ్యంగా తీసుకుంటూ ఉంటాము. వాటిలో బాదంప‌ప్పు, వాల్ న‌ట్స్ కూడా ఒక‌టి. ఇవి రెండు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు, పోష‌కాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అయితే వీటిలో పోష‌కాలు ఎందులో అధికంగా ఉంటాయి.. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే మేలు ఏమిటి.. అలాగే ఏవి ఎక్కువ మేలును చేస్తాయి… వంటి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. బాదంప‌ప్పులో విట‌మిన్ ఇ, క్యాల్షియం, మెగ్నీషియం, ఫైబ‌ర్ వంటి పోష‌కాలు ఉంటాయి. ఇవి శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిల‌ను పెంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

అలాగే వాల్ న‌ట్స్ లో విట‌మిన్స్, మిన‌రల్స్, ప్రోటీన్, ఫైబ‌ర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇత‌ర డ్రై ఫ్రూట్స్ కంటే వాల్ న‌ట్స్ లోనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే మెద‌డు ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో వాల్ న‌ట్స్ తో పాటు బాదంప‌ప్పు కూడా మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. మెద‌డు ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో వాల్ న‌ట్స్ ను మించిన ఆహారం లేద‌ని చెప్ప‌వ‌చ్చు. వాల్ న‌ట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. మెద‌డు చుర‌కుగా ప‌ని చేస్తుంది. జ్ఞాప‌క శ‌క్తి మ‌రియు ఏకాగ్ర‌త పెరుగుతాయి. అలాగే బాదంప‌ప్పు కూడా మెద‌డు ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిలో ఉండే ప్రోటీన్ మెద‌డు క‌ణాలు ఆరోగ్యంగా ఉండేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డతాయి.

Walnuts And Almonds take them both daily for these benefits
Walnuts And Almonds

బాదంప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల జ్ఞాప‌క శ‌క్తి పెర‌గ‌డంతో పాటు మెద‌డు క‌ణాలు న‌శించ‌కుండా ఉంటాయి. అయితే అల్జీమ‌ర్స్, మ‌తిమ‌రుపు స‌మ‌స్య‌ను త‌గ్గించడంలో బావంప‌ప్పు కంటే వాల్ న‌ట్సే ఎక్కువ‌గా దోహ‌ద‌ప‌డ‌తాయని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారికి ఇవి రెండు కూడా ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. వాల్ న‌ట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నెమ్మ‌దిగా పెరుగుతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే బాదంప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే వీటిలో ఉండే మెగ్నీషియం ఇన్పులిన్ నిరోధ‌క‌తను త‌గ్గించ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది. క‌నుక డ‌యాబెటిస్ తో బాదంప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రింత మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇవి రెండు కూడా మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. అనేక పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్న‌ప్ప‌టికి బాదంప‌ప్పు కంటే వాల్ న‌ట్సే మ‌న శ‌రీరానికి మ‌రింత మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రెండింటిని కూడా రోజూ త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. రోజూ రెండు వాల్ న‌ట్స్ ను, 4 లేదా 5 బాదంపప్పుల‌ను నాన‌బెట్టి తొక్క‌తీసి తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

Share
D

Recent Posts