పోష‌కాహారం

రాత్రంతా నాన‌బెట్టిన వాల్ న‌ట్స్‌ను ఉద‌యాన్నే తినండి.. ఎన్నో అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..

వాల్ నట్స్.. మెదడు ఆకారంలో ఉండే చిన్న గింజలు. ఇవి అద్భుతమైన తీపి మరియు వగరు రుచి కలిగి ఉంటాయి. వాల్‌నట్‌లు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు మరియు మినరల్స్‌ను కలిగి ఉంటాయి. వాల్ నట్స్ ని రోజువారి ఆహారంలో జత చేసుకోవడం వలన మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఆరోగ్యకరమైన బరువును కోరుకునేవారు రోజువారి ఆహారంలో వాల్ నట్స్ ని తీసుకోవడం వల్ల అధిక బరువు అనేది నియంత్రణలోకి వస్తుంది.

కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, మంచి కొవ్వు, ఫైబర్, విటమిన్లు, కాల్షియం, ఐరన్ మరియు పొటాషియంతో లోడ్ చేయబడిన వాల్‌నట్‌లు నిజంగా సూపర్‌ఫుడ్ అని చెపవచ్చు. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. మంచి కొలెస్ట్రాల్ (HDL కొలెస్ట్రాల్) స్థాయిలను మెరుగుపరచడం మరియు గుండెను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు వాల్‌నట్‌లు మధుమేహం ఉన్నవారికి కూడా మేలు చేస్తాయి. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, వాల్‌నట్‌లను మీరు చిరుతిండిగా తినవచ్చు. ఎందుకంటే వాటిలో అవసరమైన ప్రోటీన్, ఫైబర్ మీ రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి.

take overnight soaked walnuts early in the morning

వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఒత్తిడి మరియు ఆందోళనను నివారిస్తాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వలన ఆహారాన్ని ఎక్కువగా తినాలి అనే కోరికను నివారిస్తుంది. మంచి కేలరీలను జోడించడానికి ప్రోటీన్ షేక్స్ మరియు స్మూతీలకు వాల్‌నట్‌లను కూడా జోడించి తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఒక కప్పు నీటిలో 2-4 వాల్‌నట్ ముక్కలను రాత్రంతా నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలని అందుతాయి. వాల్‌నట్స్ ని 5-6 గంటలు నానబెట్టి నిద్రవేళలో ఒక గ్లాసు పాలతో కలిపి తీసుకోవడం వలన జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తద్వారా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు నియంత్రణలోకి వస్తాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

Admin

Recent Posts