మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ సరైన ఆహారాన్ని తీసుకోవాలి. కానీ ప్రస్తుతం చాలా మంది రోజూ ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం లేదు. జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారు. దీంతో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే తరచూ ఆరోగ్యకరమైన ప్రయోజనాలను ఇచ్చే ఆహారాలను తీసుకోవాలి. ఈ క్రమంలోనే కింద తెలిపిన ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే…
1. గుమ్మడికాయ
వీటిల్లో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని తినడం వల్ల శరీరానికి క్యాలరీలు కూడా తక్కువగానే అందుతాయి. గుమ్మడికాయలను తినడం వల్ల కళ్లు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. విటమిన్ ఎ అధికంగా ఉంటుంది కనుక కంటి చూపు మెరుగు పడుతుంది. గుమ్మడికాయలను కూరగా చేసుకుని లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ప్రయోజనాలే కలుగుతాయి.
2. టమాటాలు
మనకు అధికంగా లభించే కూరగాయల్లో టమాటా ఒకటి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని చెబుతారు. అయితే టమాటాలను కూడా అదే విధంగా చెప్పవచ్చు. తరచూ టమాటాలను తీసుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
3. అరటిపండు
వీటిల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంటుంది. అరటి పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణసమస్యలను తగ్గిస్తుంది. మలబద్దకం, విరేచనాలు తగ్గుతాయి. అన్ని సీజన్లలోనూ అరటి పండ్లు లభిస్తాయి. ధర కూడా తక్కువే. కనుక వీటిని రోజూ తీసుకోవాలి.
4. వెల్లుల్లి
వెల్లుల్లిలో అనేక పోషకాలు ఉంటాయి. రోజూ పరగడుపునే రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వెల్లుల్లిని తినడం వల్ల క్యాన్సర్లు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బీపీ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
5. క్యాబేజీ, కాలిఫ్లవర్, తోటకూర
వీటిల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. కాల్షియం, ఐరన్ తదితర పోషకాలు అధికంగా ఉంటాయి. కనుక ఎముకలు దృఢంగా మారుతాయి. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.
6. జామకాయలు
జామకాయలను పేదోడి యాపిల్ అంటారు. ఎందుకంటే యాపిల్ పండ్ల తరహాలో వీటిలో పోషకాలు ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కణజాలాన్ని రక్షిస్తుంది. జలుబు, దగ్గు, ఫ్లూ తగ్గుతాయి. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.
7. నిమ్మకాయ
నిమ్మరసాన్ని రోజూ నేరుగా తీసుకోవచ్చు. లేదా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు. దీంతో ఐరన్, కాల్షియంలను శరీరం గ్రహిస్తుంది. నిమ్మకాయల్లో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కొలెస్ట్రాల్, బీపీలను తగ్గిస్తుంది. క్యాన్సర్ రాకుండా చూస్తుంది.
8. బచ్చలికూర
బచ్చలికూరను తినడం వల్ల శరీరం ప్రోటీన్లను ఎక్కువగా గ్రహిస్తుంది. కాల్షియం, ఐరన్‌లు లభిస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు బచ్చలికూర తినడం మేలు. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలతో బచ్చలికూరను తీసుకుంటే కంటి సమస్యలు తగ్గుతాయి. వయస్సు మీద పడడం వల్ల వచ్చే కంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
9. కొత్తిమీర
చాలా మంది కొత్తిమీరను ఆహారాల్లో వేసే సామగ్రిలా భావిస్తారు. ఆహారంలో కొత్తిమీర వస్తే తీసేస్తారు. కానీ కొత్తిమీరలో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల దీన్ని రోజూ తీసుకోవాలి. రోజూ కొత్తిమీర జ్యూస్‌ను తాగాలి. ఇందులో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. శరీరానికి ఐరన్ అధికంగా లభిస్తుంది. రక్తహీనత తగ్గుతుంది. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
10. గుడ్డు
కోడిగుడ్లను సంపూర్ణ పౌష్టికాహారంగా భావిస్తారు. మన శరీరానికి అవసరం అయ్యే అన్ని పోషకాలు వీటిల్లో ఉంటాయి. అందువల్ల కోడిగుడ్లను రోజూ తీసుకోవాలి. దీని వల్ల శరీరానికి ప్రోటీన్లు అందుతాయి. పోషకాలు, శక్తి లభిస్తాయి.
11. బెర్రీ పండ్లు
రాచ ఉసిరి కాయలు, మేడి పండ్లు, బ్లూ బెర్రీలు, రాస్ప్ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, క్రాన్ బెర్రీలు ఈ కోవకు చెందుతాయి. వీటిల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. విటమిన్ సి అధికంగా ఉంటుంది కనుక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక అధిక బరువు తగ్గవచ్చు. క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. వాపులు తగ్గుతాయి. క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
12. గోగులు
గోగులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అందువల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. క్యాన్సర్‌పై పోరాడుతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక మలబద్దకం ఉండదు. మానసిక వ్యాధులు తగ్గుతాయి.
13. చిలగడదుంప
చిలగడ దుంపలను తినడం వల్ల మానసిక వ్యాధులు తగ్గుతాయి. బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది కనుక కంటి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. క్యాన్సర్ కణాలు నశిస్తాయి. డయాబెటిస్ తగ్గుతుంది.
14. చేపలు
చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అందువల్ల రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. రక్తపోటు తగ్గుతుంది. శరీరంపై మచ్చలు ఏర్పడకుండా ఉంటాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
15. సముద్ర చేపలు
సముద్ర చేపలను తినడం వల్ల ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. శరీరానికి పోషకాలు లభిస్తాయి.
16. టీ
టీ తాగడం వల్ల గుండె జబ్బులు రావని, గుండె పోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా గ్రీన్ టీని సేవించడం వల్ల అధిక బరువు తగ్గుతారు. క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.
17. రాగి జావ
రాగి జావలో కాల్షియం అధికంగా ఉంటుంది. రాగి పిండితో రొట్టె చేసుకుని తినవచ్చు. లేదా జావ చేసుకుని తాగవచ్చు. దీంతో కీళ్ల నొప్పులు తగ్గుతాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. ఎండాకాలంలో శరీరానికి చలువ చేస్తుంది.
18. బ్రౌన్ రైస్
తెల్ల బియ్యంకు బదులుగా బ్రౌన్ రైస్‌ను ఆహారంలో తీసుకోవాలి. దీంతో ప్రోటీన్లు, ఫైబర్ లభిస్తాయి. ఇవి జీర్ణ సమస్యలను, షుగర్‌ను తగ్గిస్తాయి.
19. మొలకలు
అన్ని రకాల పప్పు ధాన్యాలు, కాయ ధాన్యాలను మొలకలుగా చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో కప్పు మొలకలను తీసుకోవచ్చు. వీటిల్లో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. విటమిన్ సి అధికంగా ఉంటుంది కనుక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి శక్తి, పోషకాలు లభిస్తాయి.
20. బీన్స్
చిక్కుడు, బీన్స్, ఇతర చిక్కుడు జాతి కూరగాయలు, గింజలను తినడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. వీటిల్లో ఫైబర్ ఉంటుంది కనుక జీర్ణ సమస్యలు ఉండవు. ప్రోటీన్లు లభిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. బరువు నియంత్రణలో ఉంటుంది.
21. రేగు పళ్లు
ఇవి కేవలం సీజన్‌లోనే లభిస్తాయి. అందువల్ల సీజన్ వచ్చినప్పుడు వీటిని తప్పక తినాలి. వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. విటమిన్ ఎ అధికంగా ఉంటుంది కనుక కళ్లకు మేలు జరుగుతుంది. ఐరన్ ఉంటుంది కాబట్టి వీటిని తింటే రక్తహీనత తగ్గుతుంది. షుగర్ అదుపులో ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
22. బాదంపప్పు
బాదంపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
23. ఆలివ్ ఆయిల్
ఈ నూనెలో ఒమెగా 3, 6 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. అందువల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్ ఇ ఉంటుంది కనుక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.
24. నీళ్లు
ఎన్ని పోషక పదార్థాలను తీసుకున్నా శరీరానికి రోజూ తగినంత నీరు అవసరం. నీరు లేకపోతే శరీరం మనం తినే పదార్థాల్లో ఉండే పోషకాలను గ్రహించలేదు. కనుక రోజూ తప్పనిసరిగా తగిన మోతాదులో నీటిని తాగాలి. దీంతో శరీరంలోని అన్ని కణాలకు పోషకాలు అందుతాయి. శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని తప్పనిసరిగా తాగాలి.
25. కొబ్బరి
కొబ్బరిలో మన శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ దాదాపుగా ఉంటాయి. దీన్ని తింటే పోషకాలు, శక్తి లభిస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగు పడుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365