జింక్ ఉండే ఈ ఆహారాల‌ను తీసుకోండి.. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోండి..!

దేశంలో కరోనా వైరస్ రెండవ వేవ్ అందరినీ తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఈ క్ర‌మంలోనే కోవిడ్ బారిన ప‌డి చికిత్స పొందుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇలాంటి ప‌రిస్థితిలో కోవిడ్ రాకుండా చూసుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. అందుకు గాను ఆహారంలో ప‌లు మార్పులు చేసుకోవాలి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాల‌ను తీసుకోవాలి. ముఖ్యంగా జింక్ ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి.

take these zinc foods for better immunity

మన శరీర పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న పోషకాలలో జింక్ ఒకటి. రోగనిరోధక శక్తిని పెంచడం నుండి ప్రోటీన్, ఎంజైమాటిక్ రియాక్షన్, క‌ణాల పెరుగుదల, అభివృద్ధి, ప్రోటీన్ల సంశ్లేషణలో జింక్ ఉప‌యోగ‌ప‌డుతుంది. మాంసం, విత్తనాలు, కాయలు, తృణధాన్యాలు, శ‌న‌గ‌లు మొదలైన వాటితో సహా అనేక‌ ఆహారాలలో సహజంగా లభించే జింక్ గాయాలను నయం చేస్తుంది.

ఒక అధ్యయనం ప్రకారం, జింక్ ఒక ముఖ్యమైన ఎంజైమ్‌ను నిరోధించడం ద్వారా కోవిడ్ 19 ని రాకుండా అడ్డుకోగ‌లద‌ని తేలింది. గ‌తంలో చేసిన‌ వివిధ అధ్యయనాలలో జింక్ రోగనిరోధక, పోషక లక్షణాలను కలిగి ఉందని, వైరల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పనిచేస్తుందని గుర్తించారు.

శరీరంలో జింక్ లోపం వ‌ల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి బలహీనపడటం, అప్రమత్తత లేకపోవడం, ఆకలి లేకపోవడం, చర్మంపై రంధ్రాలు తెరుచుకోవ‌డం, వాసన, రుచి తగ్గడం వంటి లక్షణాలు క‌నిపిస్తాయి.

రోగనిరోధక శక్తి కోసం జింక్ ఎక్కువ‌గా ఉండే వీటిని తినాలి

1. గుడ్లు – యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యూఎస్‌డీఏ) డేటా ప్రకారం, ఒక గుడ్డులో 5 శాతం (0.6 ఎంజీ) జింక్ ఉంటుంది. అందువ‌ల్ల‌ రోజువారీ ఆహారంలో గుడ్లను చేర్చుకోవాలి.

2. పెరుగు – జీర్ణ వ్య‌వ‌స్థ‌ ఆరోగ్యానికి పెరుగు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది. ఇది అధిక‌ మొత్తంలో జింక్ ను కలిగి ఉంటుంది. దీని వ‌ల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

3. న‌ట్స్‌, విత్తనాలు – బాదంపప్పు, వాల్‌న‌ట్స్‌, ఎండుద్రాక్ష, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ విత్త‌నాలు, నువ్వుల గింజలలో జింక్ ఉంటుంది. క‌నుక వీటిని రోజూ తీసుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

4. శ‌న‌గ‌లు – శ‌న‌గ‌లు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. భార‌తీయులు త‌ర‌చూ శ‌న‌గ‌ల‌ను తింటుంటారు. యూఎస్‌డీఏ డేటా ప్ర‌కారం తెలుపు రంగు శ‌న‌గ‌ల్లో జింక్ అధికంగా ఉంటుంద‌ని తేలింది. 100 గ్రాముల శ‌న‌గ‌ల‌ను తింటే 1.53 మిల్లీగ్రాముల జింక్ ల‌భిస్తుంది.

5. చికెన్ – శ‌రీరంలో జింక్ స్థాయిల‌ను పెంచుకునేందుకు చికెన్ కూడా ఉపయోగ‌ప‌డుతుంది. చికెన్‌లో విట‌మిన్ బి12, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి నాడీ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉచుతాయి. క‌ణాల ఉత్ప‌త్తికి స‌హాయ ప‌డ‌తాయి. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి.

కరోనా వైరస్ ప్రమాదాన్ని తగ్గించడంలో జింక్ పాత్ర

జింక్ ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల క‌ణాల పెరుగుద‌ల‌కు స‌హాయ ప‌డుతుంది. అంతే కాక రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌కు బ‌లం క‌లుగుతుంది. దీంతో ఆ వ్య‌వ‌స్థ కోవిడ్‌పై స‌మ‌ర్థ‌వంతంగా పోరాటం చేస్తుంది. దీంతో ప‌రిస్థితి తీవ్ర‌త‌రం కాకుండా ఉంటుంది. అందువ‌ల్ల జింక్ ఉండే ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి.

Share
Admin

Recent Posts