Cucumber : ఆరోగ్యానికి కీరదోస చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఆరోగ్యాన్ని మరింత పెంచుతుంది. కీరదోసని తీసుకోవడం వలన చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి అందాల్సిన ముఖ్యమైన పోషకాలను కీరా దోసతో పొందొచ్చు. అయితే కీరదోసని తినేటప్పుడు తొక్కని తీసి తినడం వలన పోషకాలని కోల్పోతూ ఉంటాము. కీర దోసలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో కరగని ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ ద్వారా వెళుతున్నప్పుడు వ్యర్ధాలని పోగు చేసి దానిని శుభ్రపరుస్తుంది.
జీర్ణశక్తి సక్రమంగా జరగడానికి కూడా కీరదోస సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యను కూడా కీరదోస పోగొడుతుంది. కీరదోసలో విటమిన్ కె కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు పొట్టు తీయకుండా కోసిన కీరా ముక్కల్లో 49 మైక్రోగ్రాముల విటమిన్ కె ఉంటుంది. ఒకవేళ కనుక తొక్క తీసినట్లైతే 9 మైక్రోగ్రాములకి అది తగ్గుతుంది. పొట్టు తీయకుండానే తినడం మంచిది.
కీరదోసని పొట్టు తీయకుండా తీసుకుంటే ఒకటి లేదా రెండు క్యాలరీలు మాత్రమే ఉంటాయి. బీటా కెరోటిన్, విటమిన్ ఎ ఇలా ఎన్నో పోషకాలు కీరాలో పుష్కలంగా ఉంటాయి. కంటి ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది. అయితే కీరదోసని ఎప్పుడైనా తినేటప్పుడు తొక్క ఉంచే తినండి. తొక్క తీసి తినడం వలన పోషకాలని కోల్పోతాము.తొక్క తీసిన ముక్కల్ని తినడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. అనవసరంగా పోషకాలని కోల్పోతారు. కాబట్టి ఈ పొరపాటు చేయకుండా కీరదోస విషయంలో జాగ్రత్త వహించండి.
కీరదోసతో మనం చాలా రకాల వంటకాలని చేసుకోవచ్చు. కీరదోసతో పెరుగు పచ్చడి వంటివి ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయ తినని వాళ్ళు రైతాలో ఉల్లిపాయకి బదులుగా కీరదోసని వేసుకుని తీసుకోవచ్చు. కీరదోసని సలాడ్స్ వంటి వాటిలో తీసుకోవచ్చు. పెద్దగా మనం కీరదోసని వండుకోవడానికి టైం పట్టదు. ఈజీగా మనం కీరదోసని మనం తినే ఆహార పదార్థాలలో కలిపి తీసుకుని తద్వారా ఈ ప్రయోజనాలని పొంది ఆరోగ్యంగా ఉండవచ్చు.