Okra Water : మనం నిత్యం తినే కూరగాయల్లో బెండకాయ కూడా ఒకటి. ఇది సీజన్‌తో సంబంధం లేకుండా మనకు దొరుకుతుంది. దీంతో ఫ్రై, పులుసు ఎక్కువగా చేసుకుంటారు. ఎలా వండుకున్నా బెండ కాయ రుచి భలేగా ఉంటుంది. అయితే కేవలం రుచికే కాదు, బెండకాయతో మనకు పలు ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. పలు అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. అందుకు బెండకాయను ఎలా తీసుకోవాలో, దాంతో ఏమేం అనారోగ్యాలు నయం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రెండు బెండకాయలను తీసుకుని బాగా కడగండి. వాటిని మొదలు, చివర భాగాలను కట్ చేయండి. అనంతరం ఒక్కో బెండ కాయను నిలువుగా చీరండి. కానీ పూర్తిగా చీరకూడదు. చివరి భాగం వరకు మాత్రమే గాటు పెట్టాలి. అలా రెండు బెండకాయలను చీరాలి. అనంతరం ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో ఆ రెండు బెండకాయలను వేయండి. ఆపై మూత పెట్టండి. రాత్రంతా ఆ నీటిని అలాగే ఉంచాక, ఉదయాన్నే ఆ గ్లాస్‌లోంచి బెండకాయలను తీసేసి ఆ నీటిని పరగడుపునే తాగేయండి. ఇలా చేయడం వల్ల ఏమేం లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ విధంగా బెండకాయ నీటిని తాగితే పేగులు, జీర్ణాశయం శుభ్రమవుతాయి. అల్సర్లు ఉంటే తగ్గుతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం నయమవుతాయి. ఫైబర్, విటమిన్ ఇ, సి, కె, మెగ్నిషయం, పాస్ఫరస్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. దీంతో చక్కని పోషణ అందుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. బీపీ తగ్గుతుంది. మధుమేహం నయమవుతుంది. రక్తంలోని షుగర్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి. ఎముకలు దృఢంగా మారుతాయి. స్త్రీలకు రుతు సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. వేడి శరీరం ఉన్న వారు తాగితే శరీరం చల్లబడుతుంది.
బెండకాయల నీళ్లను తాగడం వల్ల ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోయి అధిక బరువు ఇట్టే తగ్గుతారు. చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నేత్ర సమస్యలు పోయి దృష్టి బాగా పెరుగుతుంది. అందువల్ల బెండకాయల నీళ్లను రోజూ తాగాలి. బెండకాయలు అంటే ఇష్టం లేని వారు కూడా ఇలా సులభంగా బెండకాయల నీళ్లను తాగవచ్చు. దీంతో అనేక లాభాలను పొందవచ్చు.