Green Chilli : మన ఆరోగ్యం మన తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. మనం ఆరోగ్యం ఉండాలంటే కారం, మసాలా పదార్థాలను తక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. వీటిని తక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో మంట, అల్సర్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే కారంగా ఉండే అన్ని పదార్థాలు మన శరీరానికి హాని చేస్తాయని కాదు. కారంగా ఉన్నప్పటికి పచ్చిమిర్చి మనకు ఎంతో మేలు చేస్తుంది. పచ్చిమిర్చిని మనం వంటల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. పచ్చిమిర్చిని ఉపయోగించని వారు ఉండరనే చెప్పవచ్చు. పచ్చిమిర్చిని ఏవిధంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి మేలు కలుగుతుంది. పచ్చిమిర్చి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండుమిర్చితో చేసిన కారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. కానీ పచ్చిమిర్చిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. పచ్చిమిర్చిలో మన శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. రోజుకు ఒక పచ్చిమిర్చిని తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. మూడు నుండి నాలుగు నెలల పాటు ప్రతి రోజూ పచ్చిమిర్చిని తీసుకోవడం వల్ల కళ్లద్దాలతో పనిలేనంతగా కంటి చూపు మెరుగుపడుతుంది. పచ్చిమిర్చిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అరకప్పు తరిగిన పచ్చిమిర్చిలో కనీసం 181 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. పచ్చిమిర్చిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా హైపర్ టెన్షన్ తో బాధపడే వారు పచ్చిమిర్చిని తీసుకోవడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది.
లోబీపీతో బాధపడే వారికి ఇది ఒక చక్కటి ఔషధమనే చెప్పవచ్చు. పచ్చిమిర్చి బీపీని అదుపులో ఉంచుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వారు రోజుకొక పచ్చిమిర్చిని తినడం వల్ల శరీరానికి తగినంత ఐరన్ లభిస్తుంది. అలాగే పచ్చిమిర్చిలో ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచే గుణం ఉంటుంది. దీంతో మనం రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు. శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచే గుణాలు కూడా పచ్చిమిర్చిలో పుష్కలంగా ఉంటాయి. అదే విధంగా పచ్చిమిర్చిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. అజీర్తి సమస్య తగ్గుతుంది. పక్షవాతాన్ని తగ్గించడంలో, రక్తస్రావాన్ని అరికట్టడంలో కూడా పచ్చిమిర్చి మనకు ఉపయోగపడుతుంది. గాయాలు తగిలినప్పుడు ఆగకుండా రక్తస్రావం అవుతుంటే ఒక పచ్చిమిర్చిని తినాలి. ఇలా చేయడం వల్ల వెంటనే రక్తస్రావం ఆగుతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు, షుగర్ వ్యాధితో ఇబ్బందిపడుతున్న వారు పచ్చిమిర్చిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ప్రతిరోజూ ఒక పచ్చిమిర్చిని తినడం వల్ల క్యాన్సర్ వ్యాధి బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. పచ్చిమిర్చిని తినడం వల్ల శరీరంలో కొలాజిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో చర్మం ముడతలు పడకుండా వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. అంతేకాకుండా చర్మం అందంగా తయారవుతుంది. ఈ విధంగా పచ్చిమిర్చి మనకు ఎంతో మేలు చేస్తుంది. వంటల్లో ఎండు కారం వాడకాన్ని తగ్గించి పచ్చిమిర్చిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.