Red Capsicum : మనం ఆహారంగా తీసుకునే వాటిల్లో క్యాప్సికం కూడా ఒకటి. క్యాప్సికంను ఎక్కువగా సలాడ్ వంటి వాటిల్లో వాడడంతో పాటు వీటితో రకరకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. క్యాప్సికంతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. అలాగే క్యాప్సికం కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాప్సికంను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సాధారణంగా మనకు క్యాప్సికం వివిధ రంగుల్లో లభిస్తూ ఉంటుంది. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు ఇలా వివిధ రంగుల్లో ఉండే క్యాప్సికంలు మనకు మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. అయితే ఎన్ని రంగులు ఉన్నప్పటికి మనం ఆకుపచ్చ రంగులో ఉండే క్యాప్సికంను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉంటాము.
వంటల్లో కూడా దీనినే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. అయితే కేవలం ఆకుపచ్చ క్యాప్సికంను మాత్రమే కాకుండా ఎరుపు రంగులో ఉండే క్యాప్సికంను కూడా ఆహారంగా తీసుకోవాలని దీనిలో కూడా అనేక రకాల పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అసలు ఎరుపు రంగులో ఉండే క్యాప్సికంను మనం ఎందుకు ఆహారంలో భాగంగా తీసుకోవాలి.. దీనిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎరుపు రంగు క్యాప్సికంలో విటమిన్ ఎ, బీటా కెరోటీన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడడంతో పాటు కంటికి సంబంధించిన సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే బరువు తగ్గాలనుకునే వారు ఎరుపు రంగు క్యాప్సికంను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
శరీరంలో జీవక్రియల రేటును పెంచి అధిక క్యాలరీలు ఖర్చయేలా చేయడంలో ఎరుపు రంగు క్యాప్సికం మనకు దోహదపడుతుంది. అలాగే ఎరుపు రంగు క్యాప్సికంను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. దీనిలో అధికంగా ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఎరుపు రంగు క్యాప్సికంను తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండాఉంటాము. ఇలా ఎరుపు రంగు క్యాప్సికం కూడా మనకు ఎంతో మేలు చేస్తుందని ఈ ప్రయోజనాలన్నింటిని పొందాలంటే మనం ఎరుపు రంగు క్యాప్సికంను తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.