Top 5 Health Benefits of Green Peas : మనం పచ్చి బఠాణీని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పచ్చి బఠాణీని అనేక రకాల వంటకాల్లో విరివిగా వాడుతూ ఉంటాము. పచ్చిబఠాణీతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటితో చేసిన వంటకాలను ఇష్టంగా తింటారు. పచ్చి బఠాణీలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పచ్చి బఠాణీని కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పచ్చి బఠాణీని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. వీటిని ఎందుకు ఆహారంలో భాగంగా తీసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పచ్చి బఠాణీలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
అలాగే ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పచ్చిబఠాణీలో విటమిన్ కె ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడంలో దోహదపడుతుంది. అలాగే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. వీటినితీసుకోవడం వల్ల ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. అల్సర్ కు కారణమయ్యే బ్యాక్టీరియా వృద్దిని నివారించే గుణం కూడా పచ్చి బఠాణీకి ఉంది. అలాగే పచ్చిబఠాణీని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. పచ్చిబఠాణీని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి.
వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అంతేకాకుండా పచ్చిబఠాణీని తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. కణాల్లో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను నశింపేయడంలో దోహదపడతాయి. పచ్చిబఠాణీని తీసుకోవడం వల్ల పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా చేయడంలో పచ్చిబఠాణీలు మనకు సహాయడపడతాయి. ఈ విధంగా పచ్చిబఠాణీలు మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఈ ఆరోగ్యప్రయోజనాలన్నీ పొందాలంటే తప్పకుండా వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.