Dry Grapes : మనం డ్రై ఫ్రూట్స్ గా తీసుకునే వాటిల్లో ఎండు ద్రాక్ష కూడా ఒకటి. వీటిని చాలా మంది నేరుగా తింటూ ఉంటారు. తీపి పదార్థాల తయారీలో మనం ఈ ఎండు ద్రాక్షను ఎక్కువగా ఉపయోగిస్తాం. ఈ ఎండు ద్రాక్ష తియ్యటి రుచిని కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఎండు ద్రాక్షను తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి రోగాలబారిన పడకుండా ఉంటాం. వీటిలో అధికంగా ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. రోజూ ఏదో ఒక పూట ఎండు ద్రాక్షను తినడం వల్ల అజీర్తి సమస్య రాకుండా ఉంటుంది. అంతేకాకుండా బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో అధికంగా ఉండే కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి మినరల్స్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ వీటిని తీసుకోవడం వల్ల బలంగా, దృఢంగా ఉండడమే కాకుండా మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. వీటిని తినడం వల్ల వాతావరణ మార్పుల వల్ల కలిగే అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాము. నోటి దుర్వాసనను తగ్గించడంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. రక్త హీనత సమస్యతో బాధపడే వారు ప్రతిరోజూ ఎండు ద్రాక్షను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
రాత్రి పడుకునే ముందు గుప్పెడు ఎండు ద్రాక్షను ఒక కప్పు నీటిలో నానబెట్టి వాటిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల నీరసం, అలసట తగ్గుతాయి. దంతాల నొప్పులను తగ్గించడంలో, జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, నిద్ర లేమి సమస్యను తగ్గించడంలో ఎండు ద్రాక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలతోపాటు సంతాన లేమి సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎండు ద్రాక్షను తినడం వల్ల మనం రోగాల బారిన పడకుండా ఉండడమే కాకుండా శరీరానికి కూడా బలం చేకూరుతుంది. ముఖ్యంగా వీటిని ఈ సీజన్‌లో తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ సీజన్‌లో చాలా మంది ఈ రోగాల బారిన పడతారు. కనుక అవి రాకుండా ఉండాలంటే.. రోజూ ఎండు ద్రాక్షను గుప్పెడు మోతాదులో అయినా సరే తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇక వీటిని రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.