Eggs : కోడిగుడ్లను సహజంగానే సూపర్ ఫుడ్‌గా చెబుతారు. ఎందుకంటే మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు గుడ్లలో ఉంటాయి. కనుక వాటితో మనకు సంపూర్ణ పోషణ లభిస్తుంది. అందువల్ల రోజూ గుడ్లను తినాలని వైద్యులు కూడా చెబుతుంటారు. గుడ్ల ద్వారా అనేక పోషకాలు మనకు లభిస్తాయి. అయితే రోజూ రెండు గుడ్లను ఆహారంలో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దాంతో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కన్సల్టెంట్ డైటీషియన్ డాక్టర్ రంజనా సింగ్ చెబుతున్న ప్రకారం.. మీరు ప్రతి రోజూ అల్పాహారంలో 2 గుడ్లను తీసుకుంటే మీకు తగిన మొత్తంలో ప్రోటీన్, కాల్షియం, జింక్, సెలీనియం, ఫాస్ఫరస్, ఆరోగ్యకరమైన కొవ్వులు తదితర పోషకాలు లభిస్తాయి. అలాగే విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి5, విటమిన్ బి12, విటమిన్ బి2, విటమిన్ బి6, విటమిన్ బి9 (ఫోలేట్) కూడా లభిస్తాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి రక్షిస్తాయి. శక్తిని అందిస్తాయి. కనుక గుడ్లను రోజూ తినాలి.
2. గుడ్డులో ఉండే ప్రోటీన్ నెమ్మదిగా జీర్ణమై శరీరానికి శక్తిని ఇస్తుంది. దీనివల్ల మీరు రోజంతా శక్తివంతంగా ఉంటారు. బలమైన ఎముకలకు కావల్సిన కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు గుడ్లలో ఉంటాయి. అందువల్ల ఎముకల బలహీనతను తొలగించుకోవడానికి గుడ్లను తినాలి.
3. గుడ్డు మీ నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దాని పచ్చసొనలో ఉండే కోలిన్ ఒక ముఖ్యమైన పోషకం. ఇది నాడీ వ్యవస్థకు అవసరం. దీని వల్లమెదడు చురుగ్గా పనిచేస్తుంది. యాక్టివ్ గా ఉంటారు. పిల్లలు చదువుల్లో రాణిస్తారు. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.
4. గుడ్లు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. దీని ద్వారా మీరు వ్యాధులు, అంటురోగాలకు దూరంగా ఉంటారు.
5. గుడ్లలో కేలరీల పరిమాణం తక్కువగా ఉంటుంది. దీని కారణంగా మీరు బరువు తగ్గించే ఆహారంలో గుడ్లను సులభంగా తీసుకోవచ్చు. దీంతో బరువు తగ్గడం సులభతరం అవుతుంది.
గమనిక : గుడ్లు ఆరోగ్యవంతమే అయినప్పటికీ వీటిని ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు 2 తినవచ్చు. డయాబెటిస్, గుండె జబ్బులు ఉన్నవారు మాత్రం 2 రోజులకు 1 గుడ్డు చొప్పున లేదా డాక్టర్లు సూచించిన మేర గుడ్లను తినాల్సి ఉంటుంది.