ఎప్పటిలాగే ఆఫీస్ కు వెళ్లి తిరిగివస్తున్నాను…. చేసేది సాఫ్ట్ వేర్ జాబ్ కాబట్టి…డ్యూటీ ముగిసేవరకు టైమ్ రాత్రి 10 దాటింది. అటుగా వెళ్తున్న క్యాబ్ ను ఆపి, ఎక్కాను…చినుకులు పడి ఉండడంతో… కార్ చాలా స్లోగా వెళుతుంది…. మేడమ్ వెథర్ చాలా కూల్ గా ఉంది ఓ కాఫీ తాగుతా? పక్కనే ఫేమస్ టీ స్టాల్ ఉంది అక్కడ ఆగుతా అన్నాడు డ్రైవర్. ఓకే అన్నాను నేను. కార్ రూట్ మారి, చిమ్మచీకటిగా ఉన్న ప్రదేశంలో ఆగింది.! అప్పుడు కానీ అర్థం కాలేదు నాకు…నేను మనిషి ముసుగు కప్పుకున్న ఓ మృగం చేతికి చిక్కానని…
కార్ ఆగింది మొదలు…ప్రతిక్షణం నాకు నరకమే చూపించాడు ఆ మానవమృగం. తన బలాన్నంతా నా దేహం మీద చూపుతున్నాడు. అన్నా నీ చెల్లెల్లాంటి దాన్ని అని కాళ్ళు పట్టుకున్నా… అతడు నాలోని ఆడతనాన్నే చూశాడు కానీ…చెల్లి తనాన్ని చూడలేకపోయాడు. మొదటి జీతంతో ఎంతో ప్రేమగా కొనుక్కున్న డ్రెస్ ను…. శరీరం నుండే చించేశాడు. నా ఆర్తనాదాలు… మత్తులో జోగుతున్న అతడి చెవికి ఏ మాత్రం వినిపించట్లేదు…. కామవాంఛతో రగిలిపోతున్న అతనిని తల్లి-చెల్లి ల్లాంటి బంధాలు… మానవత్వం-జాలి-దయ లాంటి మానవ విలవలు ఏ మాత్రం నిలువరించలేకపోయాయి.ఆ మృగం కారణంగా నా శరీరం పచ్చిపుడైంది.
ఓ స్త్రీ పాలిండ్లను ఇలా సిగరెట్ తో కాల్చే దుర్మార్గుడుగా వీడు తయారవుతాడని ముందే తెలిస్తే…వీడి తల్లి వీడికి పాలు పట్టేదే కాదు…పుట్టగానే గొంతు నులిమి చంపేసేదెమో. ఎంతగా విడిపించుకోవాలని ప్రయత్నించినా….బయటపడలేని స్త్రీ బలహీనతను చూసి అతడు ఇలా నవ్వుకుంటాడని… పరస్త్రీని తన దురాక్రమంతో ఇలా చేస్తాడని ముందే తెలిస్తే..వీడి తల్లి వీడికి చందమామ రావే ..అని పాడుకుంటూ తినిపించే గోరుముద్దల్లో ఆనాడే విషం కలిపి చంపేసి ఉండేదేమో? పులి తన పంజాతో జింకలను వేటాడినట్టు..అతని గోర్లను ఇలా స్త్రీల శరీరంపై గుచ్చుతాడని ముందే తెలిస్తే….చిన్నప్పుడే వీడి తల్లి పట్టుకారు పెట్టి వీడి గోర్లను మొదళ్లతో సహా పీకించేదేమో?
కుక్కలా మీద పడి….మూతులు నాకే వాడని ముందే తెలిస్తే…..వీడి తల్లి వీడిని స్కూల్ కు పంపేటప్పుడు వేసే వేడివేడి అట్లకాడ తీసుకొని వీడి మూతి మీద నాలుగు వాతలు పట్టేదేమో? బలవంతంగా ఓ స్త్రీ శరీరం మీద ఇంత రాక్షసంగా ఊగిపోతాడని ముందే తెలిస్తే..వీడి తల్లి ఊయలలో ఊపే టప్పుడే..అక్కడి నుండి కిందికి తోసేసి పీడ వదిలిందని చేతులు దులుపుకునేదేమో? జన్మస్థాలాన్ని.. కామక్రీడా స్థలంగా పరిగణించి చెలరేగిపోతాడని..కన్నుమిన్ను కానకుండా..ప్రవర్తిస్తాడని ముందే తెలిసుంటే..వీడి తల్లి అసలు అక్కడి నుండి వీడిని బయటపడనీయకుండా…అబార్షన్ పేరుతో డాక్టర్ల కత్తులకు బలిచ్చేదేమో? ఊపిరాడనివ్వకుండా…మీదపడి ఉక్కిరి బిక్కరి చేసి…మానాలను దోచే దౌర్భాగ్యుడిగా. మారతాడని ముందే తెలిస్తే… వీడి తల్లి…తలగడతో ,వీడి ఊపిరాడనివ్వకుండా చేసి చచ్చాడ్రా రేపటి రాక్షసుడని ముందే సంబరాలు చేసుకునేదేమో?