Off Beat

క‌ర్మ సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారా ? ఫ‌న్నీ అయిన క‌థ‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">&period;&period;నేనంటే నీకు ఇష్టమే కదూ&quest;&period;&period; అనడిగిందా అమ్మాయి&period; కంగారుపడిపోయాను&period; సూటిగా అలా అడిగినప్పుడు అబ్బే లేదు అని చెప్పగలిగే వయసు కాదది&period; ఎన్ని రకాలుగా తల ఊపవచ్చో ఊపేసాను&period; &period;&period;గుడ్&period;&period; ఇక నుండి నేను నీ గాళ్ ఫ్రెండ్ ని&period;&period; నువ్ నా బాయ్ ఫ్రెండ్ వి&period;&period; అంటే ఏమిటో తెలియదు&period; తనకు మాత్రం అన్నీ తెలుసు&period; నాకన్నా నాలుగేళ్లు పెద్దది పైగా చురుకైనది&period; తనకు ఉన్న జ్ఞానంలో కొంచెం కూడా నాలో లేదని తెలుసు&period; మళ్ళీ తలూపాను&period; &period;&period;డబ్బులున్నాయా&quest;&period;&period; అంది&period;&period; జేబులు వెతుక్కున్నాను&period; మూడు రూపాయలు ఉన్నాయి&period; తీసి ఇవ్వబోతుంటే &&num;8211&semi; &period;&period;ఓయ్ నాకెందుకు&period;&period; పద సినిమాకి వెళదాం&period;&period; అంది&period; &period;&period;అన్ని డబ్బులు లేవుగా&period;&period; అన్నాను&period; &period;&period;ఇంట్లో కూడా లేవా&quest;&period;&period; అని అడిగింది&period; ఉన్నాయని తలూపాను&period; &period;&period;వెళ్లి తీసుకుని రా&period;&period; అందామె&period; భయమేసింది&period; ఎప్పటి నుండో దాచుకున్న డబ్బులు&period; పైగా&comma; సినిమాకి అప్పటి దాకా నాన్నతో వెళ్లడమే తెలుసు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అసలు&comma; పెద్దవాళ్ళు లేకుండా అలా ఎలా ఇద్దరమే సినిమాకి వెళ్తాం&quest; ఎవరికైనా తెలిస్తే&quest; గుండాగినట్టు అనిపించింది&period; &period;&period;ఆడపిల్లని&comma; నేనే ధైర్యం చేస్తున్నా గా&comma; నీకేం భయం&quest;&period;&period;అనగానే కిక్కురుమనలేదు&period; సినిమా హాల్ కి వెళ్లాం&period;&period; కాళ్ళు చేతులు విపరీతంగా వణికాయి&period; మా పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తే &&num;8211&semi; ఏరా స్కూల్ కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావ్ అంటారేమో అని&period; అదృష్టం&period; ఖాళీగా ఉంది&period; &period;&period;నువ్వెళ్ళి మూడు టికెట్లు తీసుకుని రా&period;&period; అని ఒక కాయిన్ తీసుకుని ఫోన్ చేయడానికి వెళ్ళింది&period; నా అంతట నేను టికెట్లు తీసుకున్న అనుభవం లేదు&period; పెద్దలు ఎవరో ఒకరు ఉండేవారు&period; కౌంటర్ ఏమో నాకన్నా ఎత్తులో ఉంది&period; అసలు&comma; మూడు ఎందుకు అని అడగడానికి మొహమాటం&period; టికెట్లు తీసుకున్నాం&period; కానీ లోపలికి వెళ్లలేదు&period; సినిమా లోపల స్టార్ట్ అయిపోయింది&period; సినిమా అంటే మొదటి నుండి చూడాలి అనుకునే అప్పటి సినిమా కక్కుర్తి బ్యాచ్ లో నేనూ ఒకడిని&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90488 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;movie&period;jpg" alt&equals;"do you believe in karma strategy funny story " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాకన్నా కొంచెం వయసులో పెద్దవాడైన ఓ కుర్రాడు వచ్చాడు&period; అతడిని చూడగానే ఈ అమ్మాయి ముఖంలో కళ వచ్చింది&period; &period;&period;ఎవడీడు&period;&period; అనడిగాడు నన్ను తేరిపార చూస్తూ&period; &period;&period;మా పక్కింట్లో అబ్బాయి&period;&period; తమ్ముడేలే&period;&period; అంది&period;&period; ఎందుకు తెచ్చావ్&period;&period; అని అడిగాడు&period; ఇక్కడి దాకా ఒంటరిగా రావాలంటే ఇంట్లో వదులుతారా ఏంటి&period;&period; వీడితో అయితే ఎవరికీ అనుమానం రాదు&period;&period; అంది&period; నేను తమ్ముడు అనే దగ్గరే ఆగిపోయాను&period; బాయ్ ఫ్రెండ్ అంటే తమ్ముడని అప్పుడే అర్ధమైంది&period; వేరే ఏదో అర్ధం ఉందేమో అనుకున్నాను&comma; ఇంకా నయం&period; విశ్లేషించడంలో ఎప్పుడూ ముందు ఉండేవాడిని&period; దాంతో ఇంకొంచెం ఆలోచించగా&comma; బ్రదర్ అంటే తమ్ముడు కాబట్టి&comma; బాయ్ ఫ్రెండ్ అంటే పక్కింట్లో ఉండే తమ్ముడని అర్ధం చేసుకున్నాను&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లోపలకు వెళ్లాక వాళ్ళ గుసగుసలు&comma; చేతుల కదలికలు ఎక్కువవుతూ ఉంటే ఆ అమ్మాయి నా వైపు వంగి &period;&period;డబ్బులు ఉన్నాయిగా&quest; ఏవైన తినడానికి పట్రా&period;&period; అంది&period; సినిమా మధ్యలో అలా ఎలా వదిలి వెళతాం&quest; ఎప్పుడూ జరగలేదలా&period; కదలకపోతే&period;&period;బాయ్ ఫ్రెండ్ అంటే గాళ్ ఫ్రండ్ చెప్పిన మాట వినాలి&period;&period; అంది కటువుగా&period; ఖర్మరా బాబూ అనుకుంటూ బయటకు వచ్చాను&period; అదిగో అప్పుడే తెలిసింది ఖర్మ అంటే ఏమిటో&period; బోలెడు డబ్బులు పోవడమే గాకుండా సినిమా కూడా సరిగా చూడనివ్వలేదు&period; కర్మ సిద్ధాంతం గురించి నాకు తెలియదు గానీ ఖర్మ సిద్ధాంతం గురించి బాగా తెలిసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts