పావురాల గురించి తెలియని వారు ఉండరు. తెల్లటి ఆకారంలో, ఎంతో అందంగా ఉంటాయి ఈ పావురాలు. చాలా మంది ఈ పావురాలను పెంచుకుంటూ ఉంటారు. అంతేకాదు పూర్వ కాలంలో పావురాలతో సమాచారాన్ని పంపించేవారు. అయితే మామూలుగా ప్రతి పావురానికి ఇలా సమాచారాన్ని తీసుకువెళ్లి మళ్లీ సమాచారాన్ని తీసుకువచ్చే వీలు ఉండదు. వారి మెసేజ్ ని పంపడానికి పూర్వకాలంలో ఒక రకమైన పావురాలను మాత్రమే ఉపయోగించేవారు. ఆ పావురాలని హోమింగ్ పావురాలు అని అంటారు. ఈ పావురాలకు అవి ఉన్నచోటు, వాటి చుట్టూ ఉన్నచోటు బాగా తెలిసి ఉంటుంది. అవి ఎంత దూరం వెళ్లినా సరే మళ్లీ తిరిగి వాటి ఇంటికి వెళ్లగలుగుతాయి.
అందుకే ఏదైనా సమాచారాన్ని పంపడం కోసం ఈ పావురాలని ఉపయోగించేవారు. ఒకవేళ ఒక రాజు దగ్గరికి వేరే రాజ్యం నుండి మెసెంజర్ (దూత) వస్తే ఆ రాజు దగ్గర ఆ రాజ్యంలో ఉన్న పావురాలని తీసుకొని వెళ్తాడు. వాటిని ఒక పంజరంలో పెట్టుకొని తీసుకెళ్తాడు. వారి రాజు చెప్పిన విషయాన్ని ఈ పావురాలకి కట్టి పంపిస్తారు. ఈ పావురాలకి అవి ఉండే రాజ్యం తెలుసు కాబట్టి మళ్ళీ కరెక్ట్ చోటుకే తీసుకువచ్చి సమాచారాన్ని అందవేస్తాయి.
ఇదే విధంగా 18వ శతాబ్దంలో యుద్ధం జరిగినప్పుడు సైనికులు వారితోపాటు ఒక 10 నుండి 15 పావురాలను తీసుకువెళ్లారు. యుద్ధము ఎన్నో రోజులు జరిగేది కాబట్టి 2-3నెలలకు ఒకసారి ఒక పావురంతో వారి ఇంటికి వారి గురించి సమాచారాన్ని పంపించేవారు. అయితే హోమింగ్ పావురాలు అన్నీ కచ్చితంగా సమాచారాన్ని అందజేస్తాయి అని చెప్పడం కష్టం. కొన్ని పావురాలు దారి మర్చిపోయి ఆలస్యంగా సమాచారాన్ని అందజేయవచ్చు. కొన్నిటిని దారిలో గద్దలు తినేసే అవకాశాలు ఉంటాయి. అందుకే ఒక సమాచారం రెండు మూడు పావురాలకు కట్టి పంపించేవారు. ఇప్పుడు ఈ హోమింగ్ పావురాల ఖరీదు లక్షల్లో ఉంది. ఇప్పుడు ఈ పావురాలు అంతకు ముందులాగా కాకపోయినా కూడా దగ్గర ఉన్న దారులను ఈజీగా కనుక్కుంటాయట.