మనిషై పుట్టాక ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రోజున ఎలాగోలా చనిపోక తప్పదు. కాకపోతే కొందరు ముందు, కొందరు వెనుక. అంతే తేడా.. కానీ పుట్టిన ప్రతి మనిషి కచ్చితంగా ఏదో ఒక రోజున చనిపోవాల్సిందే. చావును ఎవరూ ఆపలేరు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరికి ఒక్కో విధంగా చావు రాసి పెట్టి ఉంటుంది. కొందరికి యాక్సిడెంట్లు, కొందరికి రోగాలు, కొందరికి పాము కరవడం, కొందరికి విద్యుత్ షాక్ కొట్టడం.. ఇలా రక రకాల చావులు అందరికీ రాసి పెట్టి ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే వారు మాత్రం వింతగా చనిపోయారు. నిజంగా అలాంటి సందర్భాల్లో ఎవరూ చనిపోతారని మనం అస్సలు అనుకోం. అలాంటి విచిత్రమైన ఘటనల్లో వారు చనిపోయారు. మరి ఆయా వ్యక్తులు ఎలా చనిపోయారో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. Chrysippus.. పురాతన గ్రీకు ఫిలాసఫర్ ఈయన. చాలా ప్రతిభావంతుడు. అయితే ఇతను తాను వేసిన జోక్‌కు తానే పగలబడి మరీ నవ్వి చనిపోయాడు. నిజంగా చరిత్రలో ఇలా ఎవరూ చనిపోయి ఉండరు. 2. Richard Versalle.. ఇతనో ప్రముఖ రంగస్థల నటుడు. న్యూయార్క్ మెట్రోపాలిటన్ ఒపెరాలో ఓ నాటకాన్ని ప్రదర్శిస్తుండగా అందులో నటిస్తూ చనిపోయాడు. అయితే ఇతను ఎలా చనిపోయాడో ఇప్పటి వరకు ఎవరికీ అర్థం కాలేదు. ఈయన చనిపోతూ మాట్లాడిన చివరి మాటలు… Too bad you can only live so long. 3. Jerome Moody.. ఇతను స్విమ్మింగ్ పూల్‌లో మునిగి చనిపోయాడు. అది కూడా పార్టీ జరుగుతుండగా.. ఆ పార్టీ ఎందుకంటే… సమ్మర్ సీజన్‌లో ఎవరూ నీటిలో మునిగి చనిపోనందుకు గాను పార్టీ నిర్వహించగా, అందులో ఇతను చనిపోయాడు. ఇంకా విచిత్రం ఏమిటంటే… అప్పుడు పూల్‌లో 100 లైఫ్ గార్డ్‌లు కూడా ఉన్నాయి.
4. Gary Hoy.. ఎత్తయిన ఆకాశ హర్మ్యాల్లో గదులకు ఉండే కిటికీ అద్దాలు పగిలిపోవని చెబుతూ ఇతను అందరికీ వివరిస్తున్నాడు. అయితే ఆ సమయంలో ఆ విషయాన్ని రుజువు చేయడం కోసం ఒక కిటికీ తెరిచాడు. కానీ కిటికీ ఫ్రేమ్ విరిగి మీద పడి చనిపోయాడు. 5. Jimmi Heselden.. సెగ్‌వే అనే పరికరానికి ఓనర్ ఇతనే. అయితే దురదృష్టవశాత్తూ ఆ పరికరంపై ప్రయాణిస్తూనే అతను 50 అడుగుల ఎత్తున్న ఓ కొండ చరియపై నుంచి ప్రమాదవశాత్తూ కింద పడి మృతి చెందాడు. 6. Sachi and Tomio Hidaka.. వీరిద్దరూ భార్యాభర్తలు. పెళ్లయ్యాక 14 ఏళ్ల వరకు సెక్స్‌లో పాల్గొనలేదు. కానీ తరువాత అందులో పాల్గొన్నారు. చివరకు హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారు. 7. Vladimir Likhonos.. ఇతను ఓ కెమిస్ట్రీ స్టూడెంట్. బబుల్ గమ్‌ను సిట్రిక్ యాసిడ్ లో ముంచి నములుతాడు. కానీ ఓసారి అనుకోకుండా అతను బబుల్ గమ్‌ను పేలుడు పదార్థంలో ముంచి నమిలాడు. దీంతో దవడ పేలిపోయింది.
8. Britannie Cecil.. ఈమెకు హాకీ అంటే ఎంతో ఇష్టం. కానీ హాకీ ఆడదు. చూస్తుంది. అందులో భాగంగానే ఓ హాకీ మ్యాచ్ చూసేందుకు వెళ్లగా అక్కడ ప్లేయర్స్ కొట్టిన బాల్ ఈమెకు తాకి ఈమె మరణించింది. 9. Jennifer Strange.. ఓ రేడియో స్టేషన్ నిర్వహించిన Hold Your Pee for a Wee అనే చాలెంజింగ్ టాస్క్‌లో ఈమె పాల్గొంది. అందులో పాల్గొన్న వారు వీలున్నంత ఎక్కువ సేపు మూత్రాన్ని బిగపట్టాల్సి ఉంటుంది. అలా ఈమె ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకుంది. దీంతో ఆమె శరీరం ఉబ్బిపోయి చివరకు మరణించింది. 10. William Snyder.. ఇతను సర్కస్‌లో బఫూన్‌గా పని చేసేవాడు. అందులో భాగంగా ఓ ఫీట్ చేస్తుండగా చనిపోయాడు.
11. Roger Wallace.. ఇతనికి రేడియో కంట్రోల్డ్ ప్లేన్స్ నడపడం అంటే ఇష్టం. అందులో భాగంగానే ఓ రోజు అలాంటి ప్లేన్‌ను నడుపుతుండగా సూర్య కాంతిలో అది కనిపించలేదు. దీంతో అది ఎదురుగా వచ్చి రోగర్‌ను ఢీకొట్టింది. దీంతో రోగర్ చనిపోయాడు. 12. Marvin Gaye.. ఇతను మూడు సార్లు సూసైడ్ చేసుకుందామనుకుని ఫెయిల్ అయ్యాడు. కానీ చివరకు తన తండ్రికి తాను కొనిచ్చిన గన్ కు బలయ్యాడు. తన తండ్రే తనను కాల్చి చంపాడు. 13. Jim Fixx.. The Complete Book of Running అనే ప్రముఖ పుస్తకాన్ని ఈయన రాశాడు. దురదృష్టవశాత్తూ ఓ రోజున ఇతను రన్నింగ్ చేస్తూనే చనిపోయాడు. 14. Jessica Ghawi.. 2012 జూన్ నెలలో టొరంటోలో జరిగిన కాల్పుల ఘటన నుంచి ఈమె అదృష్టవశాత్తూ తప్పించుకుంది. అయితే తరువాతి నెలలో కొలరాడోలో జరిగిన మరో కాల్పుల ఘటనలో ఈమె మరణించింది.
15. George Michael.. ప్రపంచానికి సరికొత్త క్రిస్మస్ ట్రాక్‌ను పరిచయం చేశాడు ఇతను. దురదృష్టవశాత్తూ క్రిస్మస్ రోజే చనిపోయాడు. 16. Timothy Dreadwell.. ఇతన్ని Grizzly Man అని పిలుస్తారు. ఇతనికి ఎలుగు బంట్లు అంటే చాలా ఇష్టం. అందులో భాగంగా వాటి గురించి బాగా తెలుసని అతను అనుకున్నాడు. ఓ రోజు వేసవి క్యాంపింగ్‌లో గర్ల్ ఫ్రెండ్‌తో కలసి అడవికి వెళ్లగా ఓ ఎలుగు బంటి దాడి చేసి అతన్ని, అతని గర్ల్‌ఫ్రెండ్‌ను చంపేసింది. 17. Amy Winehouse.. మద్యం తాగవద్దని పాటల ద్వారా తెలియజేసే ఈవిడ మద్యపానం వల్లే చనిపోయింది. 18. Paul Walker.. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాల్లో మనకు కనిపించే నటుడు పాల్ వాకర్ సినిమాల్లో కార్లను వేగంగా నడుపుతూ ఉంటాడు. దురదృష్టవశాత్తూ నిజ జీవితంలో కూడా ఇతను కార్‌ను వేగంగా నడిపి యాక్సిడెంట్‌లో చనిపోయాడు. 19. Steve Irwin.. ఇతను మొసళ్లతో ఆడుకుంటాడు. వాటితో సావాసం చేస్తాడు. జంతువులు అంటే ఇతనికి ఇష్టం. అయితే ఓ చేప కుట్టడం వల్ల ఇతను చనిపోయాడు. 20. Fagilyu Mukhametzyanov.. ఒక శవ పేటికలో ఈమె తనకు తెలియకుండానే పడుకుంది. లేచి చూసే సరికి తాను శవ పేటికలో ఉన్నానని తెలుసుకుని షాక్‌కు గురైంది. దీంతో ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయింది.