మనిషి అన్నాక ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరికి మరణం తప్పదు. కాకపోతే ఒకరికి ముందు, మరొకరికి వెనుక.. అంతే తేడా.. పుట్టిన ప్రతి మనిషి చనిపోక తప్పదు. నేను చనిపోవాల్సిన రోజులు కూడా దగ్గర పడ్డాయి. నా ఆరోగ్య పరిస్థితి నాకు తెలుస్తోంది. ఇక ఎన్నో రోజులు బతకలేనని అర్థం అయింది.
ఆ రోజు నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని, అది చివరి స్టేజిలో ఉందని డాక్టర్లు చెప్పారు. అది నెమ్మదిగా పెరుగుతోంది. అందువల్ల దానికి ఎలాంటి చికిత్స లేదని డాక్టర్లు తేల్చేశారు. కొన్ని రోజుల వ్యవధి మాత్రమే ఇంకా నాకు మిగిలి ఉందని చెప్పారు. నేను ఏ క్షణమైనా చనిపోవచ్చని చెప్పారు.
మరి నేను ఆమెను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించా కదా ? ఎలా ? ఈ విషయం ఆమెకు ఎలా చెప్పను ? ఆమె కూడా నన్ను ప్రేమించింది. నాకోసం ప్రాణం ఇచ్చేంతగా నన్ను ఆరాధిస్తోంది. అలాంటిది ఈ చేదు నిజం ఆమెకు ఎలా చెప్పాలి ? అయినా తప్పదు. ఆమె సుఖంగా, సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. నేను ఇంకా ఎన్ని రోజులు బతికి ఉంటానో నాకు తెలియదు. కనుక ఆమెను పెళ్లి చేసుకుని ఇబ్బందులు పెట్టలేను.
ప్రియమైన నీకు.. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు, నువ్వు కూడా నన్ను అంతే గాఢంగా ప్రేమిస్తున్నావు.. ఆ విషయం నాకూ తెలుసు. కానీ నిన్ను విడిచి వెళ్లిపోతున్నందుకు క్షమించు. ఇంతకు మించి దారిలేదు. ఇంకా ఎన్ని రోజులు బతుకుతానో తెలియదు. కనుక నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. నీ జీవితం నుంచి వెళ్లిపోతున్నా..
ఇలా రాసి అతను ఆమెకు లెటర్ పంపించాడు. ఆమె చదివి బాధపడింది. ఒకానొక రోజు పెళ్లి చేసుకుంది. అదే రోజు అతను చనిపోయాడు. కానీ వారి ప్రేమ మాత్రం అలాగే నిలిచి ఉంటుంది.