నేటి తరుణంలో మాల్స్ ఎక్కువైపోయాయి. ఒకప్పుడు కేవలం మెట్రో సిటీలకే మాత్రమే ఈ మాల్స్ పరిమితం అయ్యాయి. కానీ ఇప్పుడు జనాలు నాగరికతకు బాగా అలవాటు పడ్డారు. పట్టణాలు, గ్రామాల్లోనూ సిటీ పోకడలు వచ్చాయి. ఆయా ప్రాంతాలు కూడా నగరాలకు సమాంతరంగా అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. దీంతో అవకాశాలకు కూడా కొదువ ఉండడం లేదు. ఈ క్రమంలోనే జనాభా కూడా అధికమవుతోంది. ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్ వ్యక్తులు, యాజమాన్యాలు చిన్న చిన్న పట్టణాల్లోనూ మాల్స్‌ను నిర్మిస్తున్నారు. దీంతో జనాలకు ఏవి కావాలన్నా ఇప్పుడు మాల్స్‌లోనే దొరుకుతున్నాయి.
ఫుడ్ కోర్టులు, సినిమా స్క్రీన్లు, దుస్తులు, కిరాణా సామాను, ఎంటర్‌టైన్‌మెంట్, బార్లు, మొబైల్ షాపులు.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల షాపులను మాల్స్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎక్కడైనా మాల్స్‌లలో ఫుడ్ కోర్టులు, సినిమా స్క్రీన్లు కేవలం టాప్ ఫ్లోర్‌లలోనే ఉంటాయి గమనించారు కదా. పై ఫ్లోర్‌కు వెళితే కానీ అవి మనకు కనబడవు. ఇక కింద మాత్రం అనేక షాపులుంటాయి. మరి ఇలా కేవలం పై ఫ్లోర్లలోనే ఫుడ్ కోర్టులు, సినిమా స్క్రీన్లను ఏర్పాటు చేసేందుకు గల కారణాలు ఏమిటో తెలుసా..? దీనికి సంబంధించిన రీజన్ ఒక్కటే.. అదేమిటంటే…
సాధారణంగా మాల్స్‌లో కింది ఫ్లోర్స్‌లలో రక రకాల షాపులుంటాయి. ఇక పై ఫ్లోర్‌లో స్క్రీన్లు, దానికి కింద ఉన్న ఫ్లోర్‌లో ఫుడ్ కోర్టులు ఉంటాయి. అలా ఎందుకు ఏర్పాటు చేస్తారంటే.. వాటిని గనక ఒక వేళ కిందే పెడితే జనాలు ఎక్కువగా వచ్చేది వాటికే కనుక వాటికి వెళ్లి ఎంజాయ్ చేసి వెంటనే వెళ్లిపోతారు. అదే వాటిని పై ఫ్లోర్లో పెట్టారనుకోండి. జనాలు వాటిలో ఎంజాయ్ చేశాక, కిందకు వెళ్లేటప్పుడు రక రకాల స్టోర్స్‌ను చూస్తారు. దీంతో వారికి ఏదైనా షాపులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో ఆయా షాపులకు బిజినెస్ కూడా వర్కవుట్ అవుతుంది. ఇది నిజానికి ఓ ట్రాప్ లాంటిదన్నమాట. మనలో సాధారణంగానే షాపింగ్ కుతూహలం ఉంటుంది కదా. అలాంటిది షాపుల్లో కళ్లకు ఆకట్టుకునే వస్తువులు కనిపిస్తే కొనుగోలు చేయకుండా ఉంటామా…? కచ్చితంగా కొంటాం. కనుకనే మనల్ని ఆకట్టుకునేందుకు మాల్స్‌లో అలా కింది ఫ్లోర్స్‌లో వివిధ రకాల షాపులను ఏర్పాటు చేస్తారు. ఇదీ.. అసలు రహస్యం..!