మనకు అనారోగ్యాలు చెప్పి రావు. చెప్పకుండానే వస్తాయి. అయితే అందుకు కారణాలు అనేకం ఉంటాయి. కొన్ని మనం చేజేతులారా చేసుకుంటే వస్తాయి. కొన్ని వంశ పారంపర్యంగా జీన్స్‌ను బట్టి వస్తాయి. కొన్ని ప్రమాదాల కారణంగా వస్తాయి. అయితే సంవత్సరంలో ఉండే 12 నెలల్లో ఎవరైనా పుట్టిన నెలను బట్టి వారికి ఎలాంటి వ్యాధులు వస్తాయో సైంటిస్టులు చెప్పేశారు. అవును, మీరు విన్నది నిజమే. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నెలలో పుట్టిన వారు ఎలాంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుందోనని స్పెయిన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అలికాంటె సైంటిస్టులు ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలో వారు 30వేల మంది ఆడ, మగ వారికి చెందిన వివరాలను సేకరించారు. ముఖ్యంగా వారు పుట్టిన నెలలను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత వారికి వచ్చిన వ్యాధులను గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. దీంతో మొత్తం డేటాను వారు విశ్లేషించగా పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ప్రధానంగా ఏ నెలలో పుట్టిన వారికి ఎలాంటి వ్యాధులు వస్తాయో వారు ఆ డేటాను బట్టి చెప్పేశారు. ఆ వివరాలను కింద తెలుసుకుందాం.
జనవరి నెలలో పుట్టిన మగవారు మలబద్దకం, అల్సర్, వెన్నెముక నొప్పి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారట. ఇక ఈ నెలలో పుట్టిన ఆడవారికి మైగ్రేన్, మెనోపాజ్ సమస్యలు, హార్ట్ ఎటాక్స్ వస్తాయట. ఫిబ్రవరి నెలలో పుట్టిన మగవారికి థైరాయిడ్, గుండె జబ్బులు, ఆస్టియో ఆర్థరైటిస్ వస్తాయట. ఆడవారికి ఆస్టియో ఆర్థరైటిస్, థైరాయిడ్, బ్లడ్ క్లాట్ సమస్యలు వస్తాయట. మార్చి నెలలో పుట్టిన మగవారికి కళ్లలో శుక్లాలు, గుండె జబ్బులు, ఆస్తమా వస్తాయి. ఆడవారికి ఆర్థరైటిస్, రుమాటిజం, మలబద్దకం వస్తాయి. ఏప్రిల్ నెలలో పుట్టిన మగవారికి ఆస్తమా, ఆస్టియో పోరోసిస్, థైరాయిడ్ సమస్యలు వస్తాయి. ఆడవారికి ఆస్టియో పోరోసిస్, ట్యూమర్లు, బ్రాంకైటిస్ వస్తాయి.
మే నెలలో పుట్టిన మగవారికి డిప్రెషన్, ఆస్తమా, డయాబెటిస్ వస్తాయి. ఆడవారికి అలర్జీలు, ఆస్టియో పోరోసిస్, మలబద్దకం వస్తాయి. జూన్ నెలలో పుట్టిన మగవారికి గుండె జబ్బులు, కంటిలో శుక్లాలు, బ్రాంకైటిస్ వ్యాధులు వస్తాయి. ఆడవారికి చిత్తం స్వాధీనం లేకపోవడం (మెంటల్), ఆర్థరైటిస్, రుమాటిజం వ్యాధులు వస్తాయి. జూలై నెలలో పుట్టిన మగవారికి ఆర్థరైటిస్, ఆస్తమా, ట్యూమర్లు వస్తాయి. ఆడవారికి మెడ నొప్పి, ఆస్తమా, ట్యూమర్లు వస్తాయి. ఆగస్టు నెలలో పుట్టిన మగవారికి ఆస్తమా, ఆస్టియో పోరోసిస్, థైరాయిడ్ సమస్యలు వస్తాయి. ఆడవారికి బ్లడ్ క్లాట్స్, ఆర్థరైటిస్, రుమాటిజం వ్యాధులు వస్తాయి. సెప్టెంబర్ నెలలో పుట్టిన మగవారికి ఆస్తమా, ఆస్టియో పోరోసిస్, థైరాయిడ్ సమస్యలు వస్తాయి. ఆడవారికి ఆస్టియోపోరోసిస్, థైరాయిడ్ సమస్యలు, పెద్ద ట్యూమర్లు వస్తాయి.
అక్టోబర్ నెలలో పుట్టిన మగవారికి థైరాయిడ్ సమస్యలు, ఆస్టియో పోరోసిస్, మైగ్రేన్ సమస్యలు వస్తాయి. ఆడవారికి హై కొలెస్ట్రాల్, ఆస్టియో పోరోసిస్, అనీమియా వ్యాధులు వస్తాయి. నవంబర్ నెలలో పుట్టిన మగవారికి చర్మ సమస్యలు, గుండె జబ్బులు, థైరాయిడ్ సమస్యలు వస్తాయి. ఆడవారికి మలబద్దకం, హార్ట్ ఎటాక్స్, వెరికోస్ వీన్స్ సమస్యలు వస్తాయి. డిసెంబర్ నెలలో పుట్టిన మగవారికి కంటిలో శుక్లాలు, డిప్రెషన్, గుండె జబ్బులు వస్తాయి. ఇక ఆడవారికి బ్రాంకైటిస్, ఆస్తమా, బ్లడ్ క్లాట్స్ సమస్యలు వస్తాయి. ఇవే కాకుండా పలు ఆసక్తికర విషయాలను కూడా సదరు సైంటిస్టులు వెల్లడించారు. ఓవరాల్‌గా చూసుకుంటే జూలై నెలలో జన్మించిన మహిళలకు బీపీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఇక సెప్టెంబర్ నెలలో జన్మించే మగవారికి థైరాయిడ్ సమస్య ఎక్కువగా వస్తుందట. ఇక ఉన్న మొత్తం 12 నెలల్లో సెప్టెంబర్ నెలలో జన్మించిన వారికే ఎక్కువ అనారోగ్యాలు వస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు.