Chitlamadha Plant : మన శరీరంలో కణతులు, గడ్డలు, ట్యూమర్స్ వంటి సమస్యలు తలెత్తడం సహజం. ఇవి తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ఈ కణతులు సాధారణ కణతులు లేదా క్యాన్సర్ కణతులో తెలియక చాలా మంది కంగారు పడుతుంటారు. కణతులు, గడ్డలు శరీరంలో ఏ భాగంలోనైనా తలెత్తే అవకాశం ఉంది. శరీరంలో ఏర్పడే ఈ కణతులను ఆయుర్వేద చిట్కా ద్వారా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం చిట్లమాధ తీగ చెట్టు ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ తీగ ఎక్కువగా పొలాల దగ్గర, చేల కంచెలకు, రోడ్ల పక్కన చెట్లకు అల్లుకుని పెరుగుతూ ఉంటుంది. ఈ మొక్కను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా పెంచుకోవచ్చు. ఈ ఆకును తుంచినప్పుడు చిటపటా అనే శబ్దం వస్తుంది. కనుక దీనిని చిటపటా ఆకు అని కూడా అంటారు.
దీనిని సంస్కృతంలో సుఖ జింహ అని పిలుస్తారు. ఈ తీగ ఆకులు చాలా పెలుసుగా ఉంటాయి. ఈ ఆకులు కొద్దిగా ఉప్పు, కొద్దిగా తీపి రుచిని కలిగి ఉంటాయి. ఈ చిట్ల మాధ మొక్క ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. దీనిని ఉపయోగించడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కణతులను తగ్గించడంలో కూడా ఈ మొక్క మనకు ఎంతో దోహదపడుతుంది. కణతులతో, గడ్డలతో బాధపడే వారు రోజూ 3 చిట్టమాధ ఆకులను, ఒక చిన్న బెల్లం ముక్కను, ఒక మిరియం గింజను కలిపి తినాలి. ఇలా క్రమం తప్పకుండా 20 నుండి రోజుల పాటు తీసుకోవాలి. ఒకవేళ కణతులు పెద్దగా ఉండే రెండు నెలల పాటు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కణతులు, గడ్డలు కరిగిపోతాయి. క్యాన్సర్ వ్యాధితో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల శరీరంలో ఇతర భాగాల్లో కణతులు రాకుండా ఉంటాయి.
అలాగే ఈ ఆకులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. కేవలం కణతుల సమస్యనే కాకుండా చిట్లమాధ ఆకును ఉపయోగించి మనం ఇతర అనారోగ్య సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. పిప్పి పన్ను సమస్యతో బాధపడే వారు ఈ చెట్టు ఆకులను, ఉప్పు కలిపి బాగా నమలాలి. ఈ మిశ్రమాన్ని నోట్లో కొద్ది సేపు ఉంచుకుని మింగాలి. ఇలా చేయడం వల్ల పిప్పి పన్ను సమస్య తగ్గుతుంది. చిట్లమాధ ఆకుతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాల సమస్యలు, చిగుళ్ల సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా మనం తయారు చేసే కూరల్లో, పచ్చళ్లో ఈ మొక్క ఆకులను కూడా వేసుకుని తయారు చేసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో ట్యూమర్స్ రాకుండా ఉంటాయి. ఈ విధంగా చిట్ట మాధ తీగ చెట్టు మనకు ఎంతగానో దోహదపడుతుందని దీనిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.