Gaddi Chamanthi : ఈ భూమ్మీద ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. ఈ మొక్కలు మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూనే ఉంటాయి. ఎన్నో కొన్ని ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయి. ఇలా ఔషధ గుణాలను కలిగి ఉన్న మొక్కలల్లో గడ్డి చామంతి మొక్క కూడా ఒకటి. దీనిని మట్టి మొలక అని కూడా అంటారు. పొలాల గట్లపై, చెరువుల దగ్గర ఈ మొక్క మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్కను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గాయాల నుండి రక్తం కారడాన్ని తగ్గించడంతోపాటు గాయాలు, పుండ్లు మానేలా చేయడంలోనూ ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. గాయాలు తగ్గిలినప్పుడు ఈ మొక్క ఆకులను దంచి రసాన్ని తీసి గాయాలపై రాయడం వల్ల రక్తం కారడం ఆగుతుంది. దంచిన ఆకులను గాయాలపై కట్టుగా కట్టడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. కనుక దీనిని గాయపాకు అని కూడా అంటారు.
షుగర్ వ్యాధిని నియంత్రించడంలో కూడా ఈ మొక్క ఉపయోగపడుతుంది. నీటిలో ఉండే ఫ్లోరైడ్ శాతాన్ని తగ్గించే గుణం కూడా గడ్డి చామంతి మొక్కకు ఉంది. తెల్ల జుట్టును నల్లగా మార్చే శక్తి కూడా ఈ మొక్కకు ఉంది. తెల్ల జుట్టు ఉన్న వారు గడ్డి చామంతి మొక్క ఆకుల రసాన్ని తీసుకుని దానికి సమపాళ్లల్లో గుంటగలగరాకు ఆకుల రసాన్ని, నల్ల నువ్వుల నూనెను కలిపి చిన్న మంటపై కేవలం నూనె మిగిలే వరకు మరిగించి చల్లగా అయిన తరువాత సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇప్పుడు కావల్సిన పరిమాణంలో ఈ నూనెను తీసుకుని గోరు వెచ్చగా చేసి రాత్రి పడుకునే ముందు కుదుళ్లకు బాగా పట్టేలా రాసి ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు ఒత్తుగా, పొడుగ్గా కూడా పెరుగుతుంది.
దోమలను పారదోలే లక్షణం కూడా గడ్డి చామంతి మొక్కకు ఉంటుంది. ఈ మొక్క ఆకులను ఎండబెట్టి వాటితో పొగ వేయడం వల్ల దోమలు తగ్గుతాయి. ఈ విధంగా ఈ మొక్కను ఉపయోగించడం వల్ల మనకు వచ్చే పలు రకాల అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.