Gaddi Chamanthi : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే వ‌ద‌ల‌కుండా ఇంటికి తెచ్చుకోండి..!

Gaddi Chamanthi : మ‌న చుట్టూ అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌లు ఉంటాయి. వాటిలో ఉండే ఔష‌ధ గుణాలు తెలియ‌క వాటిని మ‌నం క‌లుపు మొక్క‌లుగా భావిస్తూ ఉంటాం. అలాంటి మొక్క‌ల‌ల్లో గడ్డి చామంతి మొక్క కూడా ఒక‌టి. గడ్డి చామంతి మొక్క ఎన్నో ఔష‌ధ గుణాలను క‌లిగి ఉంటుంది. ఈ మొక్క మ‌న‌కు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌న‌బ‌డుతూనే ఉంటుంది. గ‌డ్డి చామంతి మొక్క ఆకుల‌ను కొన్ని ప్రాంతాల‌లో కూర‌గా వండుకుని తింటారు. పొటాషియం, కాల్షియం వంటి మిన‌రల్స్ ఈ మొక్క‌ల ఆకుల‌లో ఎక్కువ‌గా ఉంటాయి. ఈ ఆకులు యాంటీ సెప్టిక్ ల‌క్ష‌ణాలను కూడా క‌లిగి ఉంటాయి. గాయాలు త‌గిలిన‌ప్పుడు ఈ మొక్క ఆకుల ర‌సాన్ని గాయాల‌పై రాయ‌డం వ‌ల్ల ర‌క్తం కార‌డం ఆగి అవి త్వ‌ర‌గా మానుతాయి. గాయాలు త్వ‌ర‌గా మానేలా చేస్తుంది. క‌నుక దీనిని గాయ‌పాకు అని కూడా అంటారు.

చ‌ర్మ వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలోనూ ఈ మొక్క ఉప‌యోగ‌ప‌డుతుంది. గ‌డ్డి చామంతి మొక్క ఆకుల ర‌సాన్ని లేప‌నంగా రాయ‌డం వ‌ల్ల చ‌ర్మ వ్యాధులు త‌గ్గుతాయి. షుగ‌ర్ వ్యాధిని నియంత్రించే శ‌క్తి కూడా ఈ గ‌డ్డి చామంతి మొక్క‌కు ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా నీటిలో ఉండే ఫ్లోరైడ్ శాతాన్ని త‌గ్గించ‌డంలో కూడా ఈ మొక్క ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. తెల్ల వెంట్రుక‌ల‌ను నల్ల‌గా మార్చ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. గ‌డ్డి చామంతి మొక్క ఆకుల ర‌సాన్ని, గుంట‌గ‌ల‌గ‌రాకుల ర‌సాన్ని తీసుకుని దానికి స‌మ‌పాళ్ల‌లో న‌ల్ల నువ్వుల నూనెను క‌లిపి చిన్న మంట‌పై నూనె మిగిలే వ‌ర‌కు మ‌రిగించి చ‌ల్ల‌గా అయిన త‌రువాత వ‌డ‌క‌ట్టి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను వారానికి రెండు లేదా మూడు సార్లు గోరు వెచ్చ‌గా కుదుళ్ల‌కు ప‌ట్టేలా రాసి మ‌రుస‌టిరోజు త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క్ర‌మంగా తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాల‌డం త‌గ్గి జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.

Gaddi Chamanthi plant amazing health benefits
Gaddi Chamanthi

మ‌న ఇంట్లో ఉండే దోమ‌ల‌ను పాల‌దోర‌డంలో కూడా గ‌డ్డి చామంతి మొక్క స‌హాయ‌ప‌డుతుంది. ఈ మొక్క ఆకుల‌ను ఎండ‌బెట్టి వాటిని నిప్పుల‌పై వేసి ఇంటి తలుపులు, కిటికీలు అన్నీ మూసేసి పొగ వ‌చ్చేలా చేయాలి. దీంతో ఇంట్లో ఉండే దోమ‌లు న‌శిస్తాయి. ఈ విధంగా గ‌డ్డి చామంతి మొక్క అనేక ర‌కాలుగా మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts