Hibiscus Flower : ప్రస్తుత తరుణంలో మనలో చాలా మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, అనారోగ్యకర జీవన విధానం, ఇంకా వారసత్వం కూడా డయాబెటిస్ రావడానికి కారణమవుతున్నాయి. అయితే డయాబెటిస్ ని అదుపులో ఉంచడానికి ఆయుర్వేదంలో ఎన్నో వైద్య విధానాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని నిరూపితమైంది. వాటిలో మందార పువ్వు ఒకటని చెబుతున్నారు. దీనిని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ ని అదుపులో ఉంచుకోవచ్చు. అయితే ఇప్పుడు మందార పువ్వుని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.
ప్రస్తుతం జీవన పద్ధతుల్లో చోటుచేసుకుంటున్న మార్పులు, మారిన ఆహార అలవాట్లు, మద్యపానం, ఒత్తిడి మొదలైనవి మధుమేహం ముప్పును మరింత పెంచుతున్నాయి. క్లోమ గ్రంథి (Pancreas) లో ఇన్సులిన్ స్థాయిలు తగ్గినపుడు డయాబెటిస్ కి బాధితులు అవుతారు. ఇక డయాబెటిస్ టైప్ 1 లో క్లోమగ్రంథి ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయదు, అదే టైప్ 2 లో అయితే ఈ క్లోమ గ్రంథి ఇన్సులిన్ ను తక్కువగా తయారు చేస్తుంది. ఇన్సులిన్ తగ్గడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు వేగంగా పెరుగుతాయి. ఇన్సులిన్ మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది, ఇంకా రక్తంలో షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుతుంది.
ఆయుర్వేద పద్ధతుల్లో మధుమేహాన్ని తగ్గించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వాటిల్లో ఎన్నో మూలికలను వాడతారు. ఈ మూలికల్లో మందార పువ్వు ఒకటి. ఇది డయాబెటిస్ పై ప్రభావవంతంగా పని చేస్తుంది. అది ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పడు తెలుసుకుందాం.
మందార పువ్వులలో ఎన్నో వైద్య గుణాలు ఉంటాయి. అవి చాలా రోగాలను నయం చేయడానికి ఉపయోడపడతాయి. మందార పువ్వుని తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. మధుమేహంతో బాధపడుతున్న వారితోపాటు అది లేని వాళ్లు కూడా తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల షుగర్ బారిన పడకుండా ఉంటారు. రోజూ ఉదయం 4 నుండి 5 మందార పువ్వు మొగ్గలను పరగడుపునే తినడం వల్ల మధుమేహ సమస్యను తగ్గిచుకోవచ్చు. అంతే కాకుండా మందారలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సీడెంట్స్ హైబీపీని కూడా అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. ఇంకా శరీరంలోని కొవ్వుని కరిగించడానికి, బరువు తగ్గడానికి, చర్మం నిగారింపు.. మొదలైన వాటికి పని చేస్తాయి.
ఇక మందారని ఎలా తీసుకోవాలో ఇప్పడు తెలుసుకుందాం. మందార పువ్వులను తీసుకొని వాటిలోని తేమ పోయేవరకు ఎండనివ్వాలి. ఆ తరువాత వాటిని మిక్సీలో వేసుకొని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని నేరుగా కానీ లేదా టీ రూపంలో గానీ చేసుకొని తాగవచ్చు. మందార ఆకులని కూడా నేరుగా నమిలి తినవచ్చు. ఇలా రోజూ చేయడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.