Kuppinta Chettu : ప్రకృతిలో మనకు ఎన్నో రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిల్లో ఔషధ గుణాలను కలిగి ఉండే మొక్కల గురించి చాలా మందికి తెలియదు. నిజానికి అవి మన ఇంటి చుట్టు పక్కల.. పరిసరాల్లో బాగానే పెరుగుతుంటాయి. వాటిల్లో ఔషధ గుణాలు ఉంటాయని.. వ్యాధులను తగ్గించేందుకు వాటిని వాడుకోవచ్చని చాలా మందికి తెలియదు. అలాంటి మొక్కల్లో కుప్పింట మొక్క ఒకటి. దీన్నే కుప్పి చెట్టు అని కూడా అంటారు.
కుప్పి చెట్టుకు రకరకాల పేర్లు ఉన్నాయి. ఇంగ్లిష్‌లో దీన్ని ఇండియన్ నెటిల అంటారు. దీని శాస్త్రీయ నామం ఇండియన్ అకలైఫా. మళయాళంలో కుప్పమేని, కన్నడలో కుప్పిగిడ అని, హిందీలో కుప్పిఖోక్లి అని, సంస్కృతంలో హరిత మంజరి అని, మరాఠీలో ఖజోటి అని పిలుస్తారు. ఎలా పిలిచినా సరే.. ఈ మొక్క అందించే ప్రయోజనాలు మాత్రం అద్భుతమనే చెప్పాలి. ఆయుర్వేద ప్రకారం.. ఈ మొక్క అనేక వ్యాధులను నయం చేసేందుకు పనికొస్తుంది.
కుప్పింట చెట్టు ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఆ ఆకులు నొప్పులు, వాపులను తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆకులను పేస్ట్‌లా చేసి రాసి కట్టు కడుతుంటే నొప్పులు, వాపులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఇది వరమనే చెప్పవచ్చు. అలాగే గాయాలపై రాసి కట్టు కడుతుంటే.. గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి.
కుప్పింట చెట్టు ఆకులను నాలుగైద తీసుకుని రసం తీసి దాన్ని ఉదయాన్నే పరగడుపునే తాగుతుండాలి. 4, 5 రోజుల పాటు ఇలా చేస్తే జీర్ణవ్యవస్థలో ఉండే క్రిములు, పురుగులు చనిపోతాయి. ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ డికాషన్‌ను కూడా తాగవచ్చు. దీని వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది.
కుప్పింట చెట్టు ఆకుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల చర్మ సమస్యలైన గజ్జి, తామర, దురదలు తగ్గిపోతాయి. ఈ మొక్క ఆకులను పేస్ట్‌లా చేసి సమస్య ఉన్న చోట రాసి మీద బ్యాండేజ్ వేస్తుండాలి. రోజూ మారుస్తుండాలి. దీంతో వారం రోజుల్లో గుణం కనిపిస్తుంది.
పాము కాటుకు గురైన వారిని రక్షించడంలో ఈ మొక్క అద్బుతంగా పనిచేస్తుంది. ఈ మొక్క ఆకులను తెంపి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగించాలి. దీంతో విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. బాధితుల ప్రాణాలను కాపాడవచ్చు.
జీర్ణాశయం, పేగుల్లో పుండ్లు ఉన్న వారు ఈ మొక్క ఆకుల రసాన్ని రోజూ తాగుతుంటే.. ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. కడుపులో మంట కూడా తగ్గుతుంది. కనీసం 20 రోజుల పాటు వాడి చూస్తే ఫలితం ఉంటుంది.
కుప్పింట చెట్టు ఆకులను కోసి ఉదయం పరగడుపునే 2, 3 ఆకుల రసాన్ని మింగేయాలి. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. షుగర్ ఉన్నవారికి ఈ మొక్క వరమనే చెప్పాలి.
కుప్పింట చెట్టు ఆకులు కొన్ని కోసి రసం తీసి దాన్ని నీటిలో కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోయాలి. దాన్ని ఇంట్లో స్ప్రే చేయాలి. దోమలు పారిపోతాయి.
కుప్పింట చెట్టు ఆకుల రసాన్ని రోజూ అర టీస్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది.
అయితే ఈ మొక్క వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ చాలా తక్కువ మోతాదులో దీని ఆకుల రసాన్ని వాడుకోవాలి. మోతాదుకు మించితే దుష్పరిణామాలు ఏర్పడేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక గర్భంతో ఉన్న మహిళలు ఈ ఆకును ఉపయోగించరాదు.
కుప్పింట చెట్టు ఆకుల పొడి, నూనె మనకు మార్కెట్‌లో లభిస్తాయి. వాటిని కూడా పై సమస్యలకు ఉపయోగించుకోవచ్చు.