Nandivardhanam : మనం ఎన్నో రకాల పూల మొక్కలను పెరట్లో పెంచుకుంటూ ఉంటాం. కొన్ని రకాల మొక్కలు పూలు పూయడమే కాకుండా ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయి. అలాంటి మొక్కల్లో 5 రెక్కల నందివర్ధనం మొక్క కూడా ఒకటి. దీనిని గరుడవర్ధనం అని కూడా అంటారు. ఈ మొక్క పూలు చాలా అందంగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇంటి పెరట్లో పెంచుకుంటూ ఉంటారు. దైవరాధనకే కాకుండా మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలోనూ ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు.
ఈ మొక్క సంవత్సరం పొడువునా పూలను పూస్తుంది. ఈ మొక్క పూలు తెల్లగా ఎంతో అందంగా ఉంటాయి. చాలా కాలం నుండి ఆయుర్వేదంలో గరుడవర్దనం మొక్కను ఉపయోగించి అనేక రకాల వ్యాధులను నయం చేస్తున్నారు. ఈ మొక్క పువ్వులకు కంటి అలసటను తగ్గించి కంటి నరాలకు బలాన్నిచే శక్తి ఉంది. ఈ మొక్క పూలను రెండింటిని తీసుకుని నీళ్లల్లో ముంచి కళ్లు మూసుకుని కళ్లపై ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల కంటి అలసట తగ్గుతుంది. ప్రస్తుత కాలంలో కంప్యూటర్ ల మీద పని చేసే వారే ఎక్కువగా ఉన్నారు. దీని వల్ల కంటి నరాలు దెబ్బ తినడమే కాకుండా దృష్టి లోపాలు కూడా వస్తున్నాయి. ఈ విధంగా గరుడ వర్ధన పువ్వులను కళ్లపై పావు గంట సేపు ఉంచుకోవడం వల్ల కంటి అలసటతోపాటు కళ్ల మంటలు, కళ్లు ఎర్రగా మారడం, కంటిలో నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ విధంగా ఈ మొక్క పువ్వులను కళ్ల పై ఉంచుకోవడం వల్ల మానసిక ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి తగ్గుతుంది.
వయస్సు పై బడిన వారు కూడా ఇలా తరచూ చేయడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. గరుడవర్ధన పూలను ఈ విధంగా కళ్లపై ఉంచుకోవడం వల్ల పిల్లల్లో వచ్చే దృష్టి లోపాలు తగ్గుతాయి. ఈ మొక్క పూలను గ్లాస్ నీటిలో వేసి 4 గంటల పాటు ఉంచాలి. తరువాత ఆ నీటితో కళ్లను కడుక్కోవడం వల్ల కూడా కంటి సమస్యలు తగ్గుతాయి. ఈ మొక్క పూలను కోసినపుడు పాలు వస్తాయి. ఈ పాలను గాయాలపై, పుండ్ల పై రాయడం వల్ల గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి లేదా ఈ పువ్వులను పేస్ట్ గా చేసి రాసినా కూడా గాయాలు, పుండ్లు మానుతాయి.
ఈ మొక్క ఆకలు రసానికి కొద్దిగా కొబ్బరి నూనెను కలిపి నుదుటి భాగంలో రాయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. శివారాధనకు ఈ మొక్క పూలను ఎంతగానో ఉపయోగిస్తారు. ఈ పూలతో శివున్ని పూజించడం వల్ల అటంకాలు తొలగి ఐశ్వర్యం వస్తుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఈ పూలతో విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఇంట్లో సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆధ్యాత్మికంగానూ, ఔషధంగానూ పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.