Palaku Theega Mokka : ప్రకృతి మనకు ఎన్నో రకాల మొక్కలను ప్రసాదించింది. వాటిలో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉంటే మరికొన్ని మాత్రం ఔషధ గుణాలతో పాటు అతీత శక్తులను కూడా కలిగి ఉన్నాయి. అతీత శక్తి అంటే శక్తికి అందనిది, శక్తికి మించి పని చేసేదని అర్థం. ఇలా ఔషధ గుణాలను, అతీత శక్తులను కలిగిన మొక్కల్లో పాలాకు తీగ మొక్క కూడా ఒకటి. మేక మేయని ఆకు అని కూడా దీనిని అంటారు. ఈ మొక్క వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మొక్కను ఇంట్లో ఉంచుకుంటే నెగెటివ్ ఎనర్జీని మన దరి చేరకుండా చేస్తుంది. పాలాకు తీగ మొక్క ఇంట్లో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులను కూడా మన ఇంటి ఆవరణలోకి రాకుండా ఉంటాయి. నర ఘోష, నర దిష్టి, నర శాపం, కనుదిష్టి వంటివి తగలకుండా ఈ మొక్క మనకు రక్షగా ఉంటుంది.
ఎన్నో రకాల తాంత్రిక ఉపయోగాల కోసం ఈ మొక్కను వాడుతూ ఉంటారు. ఈ పాలాకు తీగ మొక్క గురించి మనలో చాలా మందికి తెలిసి ఉండదు. ఈ తీగను ఉపయోగించి సకల దిష్టి దోషాలు ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మంగళ వారం లేదా ఆది వారం ఈ రెండు రోజుల్లో లేదా ఏదైనా అమావాస్య రోజున ఈ మొక్కను మనం దిష్టి నివారణకు ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ఉదయాన్నే తలస్నానం చేసి మొక్క దగ్గరికి వెళ్లి మొక్కకు నమస్కరించుకుని అమ్మా నేను చేసుకునే పనిని సఫలీకృతం చెయ్యి అని దండం పెట్టుకుని చెప్పుకోవాలి. తరువాత భూమి నుండి మూడు అడుగులు పై ఉండే కొమ్మను కత్తిరించి తెచ్చుకోవాలి. ఇలా తెచ్చిన కొమ్మను ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టినట్టు అడ్డంగా కట్టాలి. తద్వారా ఎటువంటి నరదిష్టి, చెడు ఘోష ఇంట్లోకి రాకుండా ఈ తీగ అడ్డుకుంటుంది.

ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతి ఒక్కరి మధ్య సఖ్యత ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఈ చిట్కాను పాటించడం వల్ల ఎటువంటి దిష్టి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. నరఘోషతో, నెగెటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఉంటూ మానసిక ప్రశాంతతను కోల్పోయి, చిరాకులతో జీవితాన్ని గడుపుతూ ఉన్న వారు ఈ పాలాకు తీగ మొక్కను ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితం ఉంటుందని జీతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాను పాటించడం వల్ల మానసిక ఒత్తిడి దూరంమై ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు.