Guava Leaves : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో జామకాయలు ఒకటి. ఇవి మనకు అన్ని కాలాల్లో విరివిరిగా లభిస్తూ ఉంటాయి. జామ కాయల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చన్న సంగతి మనందరికి తెలిసిందే. జామ కాయలు మన శరీరానికి దివ్యౌషధంగా పని చేస్తాయని మనందరికి తెలిసిందే. కేవలం జామ కాయలే కాదు జామ చెట్టు ఆకులు కూడా మనక మేలు చేస్తాయి. జామ ఆకుల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. జామ కాయల కంటే జాయ ఆకుల్లోనే ఔషధ గుణాలు, పోషకాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రీయంగా కూడా నిరూపితమైనది.
పరగడుపున రోజూ 3 జామ ఆకులను నమిలి తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. శరీరంలో వాపులను, దంతాల నొప్పులను, చిగుళ్ల సమస్యలను, నోటి పూత, దగ్గు, జలుబు వంటి సమస్యలను నయం చేయడంలో జామ ఆకు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. జామ ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జామ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి మనల్ని ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా చేయడంలో ఉపయోగపడతాయి. ఉదయం పూట జామ ఆకులను తిన్నా లేదా వాటితో చేసిన కషాయన్నితాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జామ ఆకుల కషాయాన్ని తయారు చేసుకోవడం చాలా సులభం.
ఒక లీటర్ నీటిలో 5 లేదా 6 జామ ఆకులను వేసి సగం నీరు అయ్యే వరకు బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.ఇలా చేయడం వల్ల కూడా మనం మంచి ఫలితాలను పొందవచ్చు. భోజనం చేసిన తరువాత ఒక కప్పు జామ ఆకుల కషాయాన్ని తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు మన రక్తంలో వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో దోహదపడతాయి. అలాగే ఇందులో ఉండే ఫైబర్, పొటాషియం బీపీని తగ్గించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడతాయి. జామ ఆకుల జ్యూస్ ను లేదా జామ ఆకుల కషాయాన్ని తాగడం వల్ల స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. జామ ఆకుల కషాయాన్ని తాగడం వల్ల వరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.
రోజూ జామ ఆకులను తినడం వల్ల లేదా వాటితో చేసే కషాయాన్ని తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే క్యాన్సర్ వ్యాధి గ్రస్తులు వాడే మందుల వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించడంలో కూడా ఈకషాయం మనకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ కషాయాన్ని తాగడం వల్ల చాలా సేపటి వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో మనం బరువు కూడా తగ్గవచ్చు. జామ ఆకులను పేస్ట్ గా చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవడం వల్ల లేదా దీనిని స్క్రబ్ లా వాడడం వల్ల అనేక రకాల చర్మ సమస్యలు తగ్గుతాయి. జామ ఆకులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల వృద్ధాప్య ఛాయలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. జామ ఆకులను ఈ విధంగా వాడడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.