Pariki Chettu : గ్రామాలలో, పొలాల గట్ల మీద, రోడ్డుకు ఇరువైపులా ఎక్కువగా కనిపించే చెట్లల్లో పరికి కాయల చెట్టు కూడా ఒకటి. దీనిని పరికి చెట్టు అని కూడా అంటారు. వీటి కాయలు చాలా చిన్నగా, నల్లగా ఉంటాయి. ఈ పండ్లు చాలా రుచిగా ఉంటాయి. పరికి పండ్లను తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పండ్లను పిల్లలకు ఇవ్వడం వల్ల పిల్లల్లో ఎదుగుదల బాగా ఉంటుంది. ఈ కాయలు పచ్చగా ఉన్నప్పుడు పచ్చ రంగులో, దోరగా ఉన్నప్పుడు ఎరుపు రంగులో, పండినప్పుడు నల్లగా ఉంటాయి. పరికి పండ్లు తినడానికి చాలా వీలుగా ఉటాయి. వీటిలో ఒక గింజ మాత్రమే ఉంటుంది. ఈ గింజతో కలిపి పండును మొత్తం తింటూ ఉంటారు. పరికి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పండ్లు ఎటువంటి రసాయనాలు వేయకుండా మనకు దొరుకుతాయి. కనుక వీటిని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అనేక రకాల పోషకాలను మనం పొందవచ్చు. శరీరాన్ని రోగాల బారిన పడకుండా చేయడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ పండ్లను తినడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా ఉంటాం. పిల్లలకు పరికి పండ్లను ఇవ్వడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. ఈ పండ్లను తినడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. పరికి చెట్టు ఆకులను పేస్ట్ గా చేసి గాయాలపై ఉంచడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. మనలో చాలా మందికి అసలు ఈ పండ్ల గురించి తెలియదు. మారుతున్న జీవన శైలి కారణంగా ఈ పండ్లను చాలా మంది తినడం మానేశారు. కనుక రోగాల బారిన పడుతున్నారు. ఈ పండ్లు మనకు సంవత్సరానికి ఒకసారి లభిస్తాయి.
ఇవి లభించినప్పుడు వీటిని తినడం వల్ల సంవత్సరమంతా రోగాల బారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలోనూ ఇవి ఉపయోగపడతాయి.వీటిని తినడం వల్ల ఎన్నో రకాల రోగాల బారిన పడకుండా ఉంటాం. పరికి పండ్లే కదా అని వీటిని తక్కువగా అంచనా వేయకూడదు. మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలను అందించడంలో ఈ పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.