గ్రీన్ టీని తాగడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రోజూ రెండు కప్పుల గ్రీన్ టీని తాగితే అధిక బరువు తగ్గుతారు. అయితే గ్రీన్ టీని తాగేందుకు కూడా ఒక సమయం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఆ టీని తాగరాదు. మరి గ్రీన్ టీని ఎప్పుడు తాగాలి, ఎప్పుడు వద్దు ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
గ్రీన్ టీ మన జీవక్రియలను పెంచుతుంది. బరువు తగ్గడానికి, శరీర మలినాలను బయటకు పంపడానికి గొప్పగా సహాయపడుతుంది.
గ్రీన్ టీ తాగడానికి ఉత్తమ సమయం ఏది ?
నిపుణుల ప్రకారం.. బరువు తగ్గడానికి గ్రీన్ టీ తాగడానికి ఉత్తమ సమయం ఉదయం. వ్యాయామం చేయడానికి ముందు తాగాల్సి ఉంటుంది.
ఎప్పుడు గ్రీన్ టీ తాగకూడదు ?
భోజనం చేసిన వెంటనే, నిద్రపోయే ముందు గ్రీన్ టీ తాగడం మానుకోండి.
బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఎలా తాగాలి ?
గ్రీన్ టీ ద్వారా బరువు తగ్గడం లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మీరు రోజుకు 2 నుండి 3 కప్పుల వరకు గ్రీన్ టీ తాగవచ్చు. ఉదయం వ్యాయామం చేసేందుకు ముందు, బ్రేక్‌ఫాస్ట్ చేసిన తరువాత 2 గంటలకు, లంచ్ అయ్యాక 2 గంటల అనంతరం గ్రీన్ టీ తాగవచ్చు. ఇలా తాగితే బరువును వేగంగా తగ్గించుకోవచ్చు.