ఆయుర్వేద ప్రకారం తేనెను అద్భుతమైన ఔషధంగా చెబుతారు. తేనెలో ఎన్నో ఔషధ విలువలు, పోషకాలు ఉంటాయి. అందువల్ల తేనే అనేక రకాల సమస్యలకు పనిచేస్తుంది. తేనె సహజసిద్ధమైన తీయని పదార్ధం. స్వచ్ఛమైన తేనె ఎన్ని రోజులు ఉన్నా అలాగే ఉంటుంది. పాడు కాదు. అయితే ఒక టీస్పూన్ తేనెను రోజూ ఉదయాన్నే పరగడుపునే తీసుకోవచ్చా ? తీసుకుంటే ఏం జరుగుతుంది ? అన్న వి షయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తేనె అద్బుతమైన ప్రయోజనకారి. అందువల్ల దాన్ని ఎప్పుడైనా ఎలాగైనా తీసుకోవచ్చు. కాకపోతే తేనెను వేడి చేయరాదు. చేస్తే అందులో ఉండే గుణాలు పోతాయి. కానీ వేడి పదార్థాలతో కలిపి తీసుకోవచ్చు. ఆయుర్వేదంలో వేడి నీరు, పాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందువల్ల తేనెను ఉదయం అయితే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి. అదే రాత్రి అయితే ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కలిపి తీసుకోవాలి. ఇలా తేనెను తీసుకోవాల్సి ఉంటుంది.
తేనెను ఉదయాన్నే పరగడుపునే ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి పోషకాలు, శక్తి లభిస్తాయి. తేనెలో సహజసిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అందువల్ల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. తేనె వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
వర్షాకాలంలో సహజంగానే సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. అందువల్ల రోజూ పరగడుపునే తేనెను తీసుకోవడం మంచిది. తేనెను పరగడుపునే నేరుగా అలాగే తీసుకోవచ్చు. లేదా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి కూడా తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు తేనెను ఉదయం గోరు వెచ్చని నీటితో తీసుకోవాలి. అదే బరువు పెరగాలని అనుకునేవారు తేనెను రాత్రి పాలతో తీసుకోవాలి. ఇలా తేనెను వాడుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365