అధిక బరువును తగ్గించుకునేందుకు, అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్ చేయాలని వైద్యులు చెబుతుంటారు. అయితే వాకింగ్ చేయడం వల్ల నిజంగానే అధిక బరువు తగ్గుతారా ? అని చాలా మందికి సందేహాలు వస్తుంటాయి. మరి అందుకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
వాకింగ్ చేయడం వల్ల అధిక బరువు తగ్గుతారు. నిజమే. అయితే వాకింగ్‌ను ఎప్పుడు చేశామన్నది ముఖ్యం. సాయంత్రం కన్నా ఉదయం వాకింగ్ చేయడం వల్లే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది. అలాగని సాయంత్రం పూట వాకింగ్ చేయవద్దని కాదు. ఎవరికి నచ్చినట్లు వారు వాకింగ్ చేయవచ్చు. కానీ వాకింగ్ వల్ల ఎక్కువ ప్రయోజనం పొందాలంటే మాత్రం ఉదయాన్నే వాకింగ్ చేయాలి. ఇది సైంటిస్టులు చెబుతున్న మాట.
ఇక వాకింగ్‌ను ముందుగా నెమ్మదిగా ప్రారంభించాలి. తరువాత వేగం పెంచాలి. మళ్లీ నెమ్మదిగా నడిచి మళ్లీ స్పీడ్ పెంచాలి. కాళ్ల కదలికలకు అనుగుణంగా చేతులను ఊపుతూ వాకింగ్ చేయాలి. దీని వల్ల శరీరంలో అన్ని అవయవాలు సమన్వయం అవుతాయి. వాకింగ్‌ను స్పీడ్‌గా చేశాక అవసరాన్ని బట్టి స్పీడ్ తగ్గిస్తూ పెంచుతూ పోవాలి. ఇలా రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి.
అయితే అధిక బరువు త్వరగా తగ్గాలని అనుకునే వారు రోజుకు కనీసం 45 నిమిషాల పాటు అయినా సరే వాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని కూడా సైంటిస్టులు చెబుతున్నారు. దీని వల్ల కనీసం 3-4 కిలోమీటర్ల దూరం నడవచ్చు. ఈ క్రమంలో చక్కని వ్యాయామం అవుతుంది. అధిక బరువును త్వరగా తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఉదయం వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి మరింత మేలు జరుగుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి.