ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు.. పండు మిర‌ప‌కాయ‌లు.. రెండింటిలో ఏవి మంచివి ?

మ‌న‌లో చాలా మంది రోజూ ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను కూర‌ల్లో వేసి వండుతుంటారు. వాటితో అనేక ర‌కాల వంట‌లు చేయ‌వ‌చ్చు. ఇత‌ర కూర‌ల్లోనూ వాటిని వేయ‌వ‌చ్చు. ఇక పండు మిర‌ప‌కాయ‌ల‌ను కూడా కొంద‌రు వాడుతుంటారు. అయితే ఈ రెండింటిలో ఏవి మంచివి ? వేటిలో ఎక్కువ పోష‌కాలు ఉంటాయి ? అంటే…

green chilli or red chilli which one is better

ప‌చ్చి.. పండు.. రెండు మిర‌ప‌కాయ‌లు మంచివే. వేటిని తిన్నా ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి. అయితే పోష‌కాల విష‌యానికి వ‌స్తే మాత్రం పండు మిర‌ప‌కాయ‌ల్లోనే పోష‌కాలు అధికంగా ఉంటాయి. వాటిల్లో విట‌మిన్ సి, బీటా కెరోటిన్, విట‌మిన్ ఎ, బి, ఇత‌ర ఖ‌నిజాలు ఎక్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల పండు మిర‌ప‌కాయ‌ల‌ను తింటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క్యాన్స‌ర్ల‌తో పోరాడే ఔష‌ధ గుణాలు పండు మిర‌ప‌కాయ‌ల్లో ఉంటాయి. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్స‌ర్ రాకుండా ఉంటుంది. అలాగే జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో ఉండే హానిక‌ర బాక్టీరియా నిర్మూలించ‌బ‌డుతుంది.

పండు మిర‌ప‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఆక‌లి పెరుగుతుంది. ర‌క్త ప్ర‌స‌ర‌ణ సాఫీగా జ‌రుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ర‌క్త‌నాళాల్లో పేరుకునే కొవ్వు క‌రుగుతుంది. పండు మిర‌ప‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల జ‌లుబు, జ్వ‌రం త‌గ్గుతాయి. నొప్పులు, వాపుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఆర్థ‌రైటిస్, సోరియాసిస్‌, డ‌యాబెటిస్ వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు పండు మిర‌ప‌కాయ‌ల‌ను తినాలి. దీని వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

పండు మిర‌ప‌కాయ‌లు జీర్ణ‌శ‌క్తిని పెంపొందిస్తాయి. జీవ‌క్రియ‌లు స‌రిగ్గా జ‌రిగేలా చూస్తాయి. బ‌రువును నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి. వీటిని తిన‌డం వ‌ల్ల శ‌రీర‌లో శ‌క్తి ఎక్కువ‌గా ఖ‌ర్చ‌వుతుంది. వ్యాయామం చేసిన లాంటి భావ‌న క‌లుగుతుంది. క్యాల‌రీలు ఖ‌ర్చ‌వుతాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు.

ఆస్త‌మా, సైన‌స్, జ‌లుబు వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు పండు మిర‌ప‌కాయ‌ల‌ను తీసుకోవాలి. దీని వ‌ల్ల ఊపిరితిత్తులు, గొంతు, ముక్కులో ఉండే శ్లేష్మం క‌రుగుతుంది. ఇక త‌ల‌నొప్పి నుంచి కూడా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts