Sweets : తీపి పదార్థాలు అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. ఈ క్రమంలోనే కొందరు రోజులో తమకు ఇష్టమైన, సౌకర్యవంతమైన సమయాల్లో తీపి పదార్థాలను తింటుంటారు. కొందరు భోజనానికి ముందు తీపి తింటే.. కొందరు భోజనం ముగియగానే వాటిని తింటారు. అయితే ఆయుర్వేదం ప్రకారం తీపి పదార్థాలను ఎప్పుడు తినాలి ? అందుకు సరైన సమయం ఏది ? భోజనానికి ముందు వాటిని తినాలా ? లేక భోజనం చేసిన తరువాత తీపి పదార్థాలను తినాలా ? అంటే..
ఆయుర్వేదం ప్రకారం తీపి పదార్థాలను ఎల్లప్పుడూ భోజనానికి ముందే తినాలి. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణ రసాలు బాగా ఉత్పత్తి అవుతాయి. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడంతోపాటు అందులో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. అందుకని భోజనానికి ముందే తీపి పదార్థాలను తినాల్సి ఉంటుంది. భోజనం చివర్లో వాటిని తింటే అజీర్ణం, గ్యాస్ సమస్యలు వస్తాయి. కనుక భోజనం చేయడానికి ముందే తీపి పదార్థాలను తింటే మంచిది.
భోజనం చేయడానికి ముందు చిన్న బెల్లం ముక్క లేదా కొద్దిగా చక్కెర లేదా ఇతర తీపి పదార్థాలను కొద్దిగా తినవచ్చు. ఇక కారంగా ఉండే పదార్థాలను భోజనం చివర్లో తీసుకోవాలి. దీని వల్ల శరీరంలో ఉండే కఫం మొత్తం పోతుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ఇలా భోజనం చేయాల్సి ఉంటుంది.
ఆయుర్వేద ప్రకారం భోజనం ఇలా చేయాల్సి ఉంటుంది. ముందుగా తీపి పదార్థాలను తినాలి. దీంతో జీర్ణరసాలు ఉత్పత్తి అయి తిన్న ఆహారం జీర్ణమవుతుంది. తరువాత పులుపు, వగరు, ఉప్పుగా ఉండే పదార్థాలను తినాలి. చివర్లో కారంగా ఉండే ఆహారాలను తినాలి. దీంతో కఫం తగ్గుతుంది. ఇలా భోజనం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.