ప్ర‌శ్న - స‌మాధానం

కుంకుమ పువ్వును పాల‌లో క‌లిపి తాగితే పిల్ల‌లు అందంగా పుడ‌తారా ? ఇందులో నిజ‌మెంత ?

గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌లను పాల‌లో కుంకుమ పువ్వు క‌లుపుకుని తాగ‌మ‌ని పెద్ద‌లు చెబుతుంటారు. ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి ఈ సాంప్ర‌దాయం కొన‌సాగుతూ వ‌స్తోంది. గ‌ర్భిణీలు అందుక‌నే రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో ఒక‌టి లేదా రెండు కుంకుమ పువ్వు రెక్క‌ల‌ను క‌లిపి తాగుతుంటారు. అయితే కుంకుమ పువ్వును క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల పుట్ట‌బోయే పిల్ల‌లు అందంగా పుడ‌తార‌ని ఒక న‌మ్మ‌కం ఉంది. మ‌రి సైన్స్ దీని గురించి ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కుంకుమ పువ్వులో ఎన్నో పోష‌కాలు, ఔష‌ధ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల పాల‌లో కుంకుమ పువ్వును క‌లుపుకుని తాగితే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఆ మాట వాస్త‌వ‌మే. గ‌ర్భిణీలు 9వ నెల‌లో కుంకుమ పువ్వును పాల‌లో క‌లుపుకుని తాగితే కండ‌రాలు ప్ర‌శాంతంగా మారుతాయి. దీంతో సుఖ ప్ర‌స‌వం జ‌రుగుతుంది.

కుంకుమ పువ్వును పాల‌లో క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు త‌గ్గుతాయి. గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌ల‌కు స‌హ‌జంగానే ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయి క‌నుక అలా తాగ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది.

will saffron milk make babies beautiful

కుంకుమ పువ్వులో యాంటీ డిప్రెసెంట్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. గ‌ర్భిణీలు మాన‌సికంగా ఆరోగ్యంగా ఉంటారు.

కుంకుమ పువ్వును పాల‌లో క‌లిపి తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. ర‌క్త స‌ర‌ఫరా మెరుగు ప‌డుతుంది. అయితే కుంకుమ పువ్వును అధిక మోతాదులో తీసుకుంటే హాని క‌లుగుతుంది. క‌నుక రోజుకు 1 లేదా 2 రెక్క‌ల్ని మించ‌కుండా తీసుకోవాల్సి ఉంటుంది.

ఇక కుంకుమ పువ్వును పాల‌లో క‌లిపి తాగ‌డం వ‌ల్ల పుట్ట‌బోయే పిల్ల‌లతోపాటు త‌ల్లులు కూడా ఆరోగ్యంగా ఉంటార‌న్న మాట నిజం. సైన్స్ దీన్ని ధ్రువీక‌రించింది. కానీ పిల్ల‌లు అందంగా పుడ‌తార‌ని ఎక్క‌డా నిరూప‌ణ కాలేదు. అందువ‌ల్ల పిల్ల‌ల ఆరోగ్యం కోసం కుంకుమ పువ్వును అలా పాల‌లో క‌లిపి తీసుకోవ‌చ్చు.

Admin

Recent Posts