తాజా పరిశోధనల మేరకు ఒక నిర్దేశిత మానవ ఎంజైము డయాబెటీస్ వ్యాధిని అరికట్టగలదని తేలింది. అధిక బరువు నిరోధకత, మెరుగైన జీవప్రక్రియ, మెరుగైన ఇన్సులిన్ సరఫరాలు మానవ ఎంజైముల మెరుగుదలద్వారా అరికట్టవచ్చునని ఈ పరిశోధనలో సైంటిస్టులు తెలిపారు. రీసెర్చిలో అధిక బరువు, ఇన్సులిన్ పవర్ తగ్గుట, టైప్ 2 డయాబెటీస్, శారీరక మంటలు వీటన్నిటికి ఒకదానితో మరి ఒకటి సంబంధం కలిగివుందని వెల్లడైంది.
వీరు తమ పరిశోధనలను ముందుగా ఎలుకలపై ప్రయోగించారు. ఎంజైములు మార్చిన ఎలుకలకు అధిక కొవ్వు కల ఆహారాలు ఇచ్చినప్పటికి దాని ప్రభావం వాటిపై లేదని అవి ఎట్టి బరువును సంతరించుకోలేదని వీరు తెలిపారు. ఈ ఎలుకలకు గ్లూకోస్ ఎక్కించినప్పటికి వాటి బ్లడ్ షుగర్ స్ధాయిలో కూడా మార్పు లేదట.
అయితే, షుగర్ ఎక్కించిన కారణంగా ఈ ఎలుకలలో సాధారణంగా వున్న ఎలుకలకంటే అధిక శక్తి ఏర్పడిందని కూడా తెలిపారు. ఈ రీసెర్చి ఫలితాలు ప్రస్తుతానికి ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు. జనవరి 2026 ఎండోక్రినాలజీ పుస్తకంలో ప్రచురణకు రాగలదని తెలిపారు.