క‌రోనా నుంచి కోలుకున్న వారు ఎప్ప‌టిక‌ప్పుడు గుండె ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.. ఎందుకంటే..?

కోవిడ్ బారిన ప‌డి అనేక మంది ఇప్ప‌టికే చ‌నిపోయారు. రోజూ అనేక మంది చ‌నిపోతూనే ఉన్నారు. అయితే కోవిడ్ బారిన ప‌డి కోలుకున్న వారిలో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్న‌ట్లు సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. దీన్ని లాంగ్‌-కోవిడ్ అని పిలుస్తున్నారు. అంటే కోవిడ్ బారిన ప‌డి రిక‌వ‌రీ అయిన వారికి గుండె, ఇత‌ర భాగాల్లో స‌మ‌స్య‌లు వ‌స్తే దాన్ని లాంగ్‌-కోవిడ్ అని పిలుస్తారు. ప్ర‌స్తుతం ఈ బాధితుల సంఖ్య పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

covid recovered patients must check heart regularly know why

లాంగ్-కోవిడ్ బారిన ప‌డిన అనేక మందిలో గుండె స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని సైంటిస్టులు తెలిపారు. ఈ మేర‌కు వారు చేసిన అధ్య‌య‌నాల‌కు చెందిన వివ‌రాల‌ను జామా, లాన్‌సెట్ నివేదిక‌ల్లో వెల్ల‌డించారు. కోవిడ్ బారిన ప‌డి కోలుకున్న వారిలో ఎక్కువ‌గా గుండె, మెద‌డు, కిడ్నీల స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని తెలిపారు.

కోవిడ్ నుంచి కోలుకున్న త‌రువాత కూడా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని గ‌తేడాదిలోనే చెప్పారు. అయితే ప్ర‌స్తుతం ఇలాంటి బాధితుల సంఖ్య పెరిగింద‌ని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది కోవిడ్ బారిన ప‌డి కోలుకున్న త‌రువాత గుండె స‌మ‌స్య‌ల‌కు గురై హాస్పిట‌ళ్ల‌కు వ‌స్తున్నారు. అందుక‌ని కోవిడ్ నుంచి కోలుకున్న వారు త‌ప్ప‌నిస‌రిగా వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో.. ఛాతిలో అసౌక‌ర్యం, ఎడ‌మ లేదా కుడి భుజాల నుంచి చేతుల‌కు నొప్పి వ్యాపించ‌డం, అసాధార‌ణ రీతిలో చెమ‌ట ప‌డుతుండ‌డం, అసాధార‌ణ రీతిలో గుండె కొట్టుకోవ‌డం, తీవ్ర‌మైన అల‌స‌ట, చిన్న ప‌నిచేసినా, అస‌లు ప‌నిచేయ‌క పోయినా బాగా అల‌సిపోయిన‌ట్లు అవ‌డం.. వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని, క‌నుక ఇలాంటి ల‌క్ష‌ణాలు ఉన్న ఎవ‌రైనా స‌రే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే వైద్యుల‌ను సంప్రదించి ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని, అవ‌స‌రం అయిన మేర మందుల‌ను వాడాల‌ని సూచిస్తున్నారు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts