Classical Music : ఏం చేసినా డిప్రెష‌న్ త‌గ్గ‌డం లేదా..? అయితే క్లాసిక‌ల్ మ్యూజిక్‌ను వినండి..!

Classical Music : మీకు సంగీతం అంటే అస‌లు ఇష్టం ఉండదా..? అందులోనూ క్లాసిక‌ల్ మ్యూజిక్ అంటే అస‌లు ప‌డ‌దా..? అయితే ఆగండి. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది వింటే మీరు క్లాసిక‌ల్ మ్యూజిక్‌పై మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. అవును, మేం చెబుతోంది నిజ‌మే. ఎందుకంటే రోజూ కాసేపు క్లాసిక‌ల్ మ్యూజిక్‌ను వింటే ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఈ మేర‌కు వారు తాజాగా ఓ అధ్య‌య‌నం కూడా చేప‌ట్టారు. దీంట్లో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగు చూశాయి. ఇక ఆ వివ‌రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొంద‌రు ప‌రిశోధ‌కులు తీవ్ర‌మైన డిప్రెష‌న్‌తో బాధప‌డుతున్న 13 మంది వ్య‌క్తుల‌పై అధ్య‌య‌నం చేశారు. వారికి రోజూ కాసేపు క్లాసిక‌ల్ మ్యూజిక్‌ను వినిపించారు. దీంతో వారి మెద‌డులో హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అయ్యాయ‌ని, రోజులు గ‌డుస్తున్న కొద్దీ వారిలో ఉన్న ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్ త‌గ్గిపోయాయ‌ని గుర్తించారు. అందువ‌ల్ల రోజూ కాసేపు క్లాసిక‌ల్ మ్యూజిక్‌ను వింటే మాన‌సిక స‌మ‌స్య‌ల నుంచి విముక్తి పొంద‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు.

listening to Classical Music daily can reduce depression say experts
Classical Music

ప్ర‌శాంత‌మైన క్లాసిక‌ల్ మ్యూజిక్‌ను వినాలి..

క్లాసిక‌ల్ మ్యూజిక్‌లో భాగంగా చాలా ప్ర‌శాంత‌మైన సంగీతం వినాలి. సంగీతంలో ఎలాంటి అరుపులు, కేక‌లు, ఫాస్ట్ బీట్ ఉండ‌కూడ‌దు. మ్యూజిక్ చాలా నెమ్మ‌దిగా, ప్ర‌శాంతంగా ఉండాలి. అలాంటి క్లాసిక‌ల్ మ్యూజిక్‌ను రోజూ వింటేనే ఫ‌లితం ఉంటుంద‌ట‌. అయితే చాలా మంది సాధార‌ణ మ్యూజిక్‌నే రోజూ విన‌రు, మ‌రి క్లాసిక‌ల్ మ్యూజిక్‌ను ఎలా వింటారు.. అంటే.. అది మీకు న‌చ్చ‌క‌పోయినా క‌చ్చితంగా అల‌వాటు చేసుకోవాల్సిందే. దీంతో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

ప్ర‌శాంత‌మైన క్లాసిక‌ల్ మ్యూజిక్‌ను వింటే మ‌న మెద‌డులో ఫీల్ గుడ్ కెమిక‌ల్స్ రిలీజ్ అవుతాయట‌. ఇవి ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్ వంటి మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయ‌ట‌. దీంతో మ‌నం విచారంగా ఉన్నా హ్యాపీ మూడ్‌లోకి మారిపోతామ‌ట‌. క‌నుక క్లాసిక‌ల్ మ్యూజిక్‌ను వినాల‌ని వారు చెబుతున్నారు. అయితే ఈ మ్యూజిక్‌ను వింటే మైండ్ రిలాక్స్ అవుతుంద‌ని, సోష‌ల్ స్కిల్స్‌, క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ కూడా పెరుగుతాయ‌ని వారు అంటున్నారు. క‌నుక మీరు కూడా రోజూ క్లాసిక‌ల్ మ్యూజిక్‌ను కాసేపు వినే ప్ర‌య‌త్నం చేయండి. దీంతో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts